AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Defence: రూ.63 వేల కోట్ల భారీ డీల్‌..! ఇక భారత్ కదనసీమలో కొదమ సింహమే..

భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో రూ.63,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందం కుదుర్చుకుని 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను సేకరించనుంది. ఇందులో 22 సింగిల్-సీటర్, 4 ట్విన్-సీటర్ విమానాలు ఉన్నాయి. ఈ అత్యాధునిక విమానాలు INS విక్రమాదిత్య, విక్రాంత్ నౌకల నుండి పనిచేస్తాయి.

India Defence: రూ.63 వేల కోట్ల భారీ డీల్‌..! ఇక భారత్ కదనసీమలో కొదమ సింహమే..
Pm Modi
SN Pasha
|

Updated on: Apr 09, 2025 | 4:27 PM

Share

26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రూ.63,000 కోట్లకు పైగా విలువైన ఈ ఒప్పందం రాబోయే వారాల్లో అధికారికంగా అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా 22 సింగిల్-సీటర్ జెట్‌లతో పాటు నాలుగు ట్విన్-సీటర్ వేరియంట్లు ఇండియన్‌ నేవీలో చేరనున్నాయి. ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, శిక్షణ, స్వదేశీ తయారీ భాగాల కోసం సమగ్ర ప్యాకేజీని అందించనుంది ఫ్రాన్స్‌. రాఫెల్ మెరైన్ జెట్‌లు సముద్రంలో నావికాదళ వైమానిక శక్తిని గణనీయంగా పెంచుతాయి.

రాఫెల్ యుద్ధ విమానాలకు ఈ రాఫెల్‌ మెరైన్‌ అడ్వాన్డ్స్‌ వెర్షన్‌. ఈ రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్‌లు 2029 చివరి నాటికి ఇండియన్‌ నేవీ చేతికి అందుతాయి. మొత్తంగా 2031 నాటికి డీల్‌ కంప్లీట్‌ అవుతుంది. ఈ జెట్‌లు భారతదేశ విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, INS విక్రాంత్ నుంచి పనిచేస్తాయి. పాత MiG-29K విమానాల స్థానంలో వీటిని ఉపయోగిస్తారు. ఫ్రెంచ్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి నిర్వహణ మద్దతు ఉంటుంది. ఇక ప్రత్యేకతల విషయానికి వస్తే.. రీన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్, అరెస్టర్ హుక్స్, షార్ట్ టేక్-ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (STOBAR) వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ జెట్లు భారత నేవీలో చేరితే.. మన శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..