Oxygen Transport: ఆక్సిజన్ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ రైల్వేలు.. ఇప్పటివరకూ ఎంత ఆక్సిజన్ రవాణా చేశాయంటే..

Oxygen Transport:  కరోనా రెండో వేవ్ ఒక్కసారిగా విరుచుకుపడిన తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందక వేలాది మంది మృత్యువాత పడ్డారు. దీంతో రంగం లోకి దిగిన భారత రైల్వే వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ రైళ్ళను నడుపుతోంది.

  • Publish Date - 1:31 pm, Mon, 17 May 21
Oxygen Transport: ఆక్సిజన్ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ రైల్వేలు.. ఇప్పటివరకూ ఎంత ఆక్సిజన్ రవాణా చేశాయంటే..
Oxygen Transport

Oxygen Transport:  కరోనా రెండో వేవ్ ఒక్కసారిగా విరుచుకుపడిన తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందక వేలాది మంది మృత్యువాత పడ్డారు. వెంటనే మేలుకొన్న ప్రభుత్వాలు ఆక్సిజన్ కొరతను నివారించడానికి రకరకాల మార్గాలను అన్వేషించాయి. విమానాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయడం. ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా రైల్వే వ్యవస్థ ద్వారా ఆక్సిజన్ పంపిణీ చేయడం చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను నివారించగలిగారు. అన్ని అడ్డంకులను అధిగమించి, కొత్త పరిష్కారాలను కనుగొనే భారతీయ రైల్వే ఈ విషయంలో చక్కని ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు, భారత రైల్వే దాదాపు 590 ట్యాంకర్లలో 9440 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.

దాదాపు 150 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం 55 ట్యాంకర్లలో 9 లోడ్ చేయబడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 970 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓతో నడుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో ఆక్సిజన్ సరఫరాలో పెద్ద ఊపు ఈ రైళ్లతో వచ్చింది, అనేక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నిన్న రాత్రి, ఈ రోజు ఆయా రాష్ట్రాల్లో గమ్యాన్ని చేరుకోబోతున్నాయి. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నాయి. అభ్యర్థించే రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో సాధ్యమైనంత ఎల్‌ఎంఓను అందించడానికి భారత రైల్వే ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది.

కేరళ తన మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను ఎర్నాకుళంలో 118 మెట్రిక్ టన్నుల లోడ్‌తో పొందింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 521 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, యుపిలో దాదాపు 2525 మెట్రిక్ టన్నులు, ఎంపిలో 430 మెట్రిక్ టన్నులు, హర్యానాలో 1228 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 389 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్లో 40 మెట్రిక్ టన్నులు, కర్ణాటకలో 361 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో 200 మెట్రిక్ టన్నులు, కేరళలో 118 మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 151 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 116 మెట్రిక్ టన్నులు, ఢిల్లీలో 3320 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ ను ఇండియన్ రైల్వే ద్వారా అందుకున్నాయి.
రైల్వేలు ఆక్సిజన్ సరఫరా స్థానాలతో వేర్వేరు మార్గాలను మ్యాప్ చేశాయి. అదేవిధంగా రాష్ట్రాలు కోరిన విధంగా వారి అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. ఎల్‌ఎంఓను తీసుకురావడానికి సంబంధిత రాష్ట్రాలు భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తాయి.

Also Read: Corona Death: బీహార్ లో దారుణం..చెత్త బండిలో మృత దేహం తరలింపు.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

Apologies: అమానుషం.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని.. దళితులను పంచాయతీ పెద్దల కాళ్ళు మొక్కించారు!