Corona Death: బీహార్ లో దారుణం..చెత్త బండిలో మృత దేహం తరలింపు.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

Corona Death: కరోనా మహమ్మారి ఒక పక్క ప్రాణాలు తీసేస్తోంది. రోగం వచ్చిన వారికి ఆసుపత్రి బెడ్ దొరకదు. వ్యాధితో చనిపోయిన వారి శవాన్ని తీసుకు వెళ్ళడానికి నలుగురు మనుషులూ కరువైపోతున్నారు.

Corona Death: బీహార్ లో దారుణం..చెత్త బండిలో మృత దేహం తరలింపు.. చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
Corona Death
Follow us
KVD Varma

|

Updated on: May 17, 2021 | 1:13 PM

Corona Death: కరోనా మహమ్మారి ఒక పక్క ప్రాణాలు తీసేస్తోంది. రోగం వచ్చిన వారికి ఆసుపత్రి బెడ్ దొరకదు. వ్యాధితో చనిపోయిన వారి శవాన్ని తీసుకు వెళ్ళడానికి నలుగురు మనుషులూ కరువైపోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల చనిపోయిన కరోనా పేషెంట్లను శ్మశానానికి తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ లు దొరకక ట్రాక్టర్ల లోనూ.. బైక్ ల మీదా తరలించిన దృశ్యాలు కనిపించాయి. అయ్యో అనిపించాయి. తాజాగా అటువంటి పరిస్థితే ఓ కోవిడ్ బాధిత మృతుని మృతదేహానికీ పట్టింది. ఇప్పుడు ఈ వీడియో ట్రేండింగ్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. పిపిఇ కిట్ ధరించిన మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు కోవిడ్ బాధితుడి మృతదేహాన్ని చెత్త బండిపై తీసుకెలుతున్నారు. ఈ మృతదేహాన్ని బీహర్‌షరీఫ్‌లోని శ్మశానవాటిక నెంబర్ 17 కు తరలించారు. ఇంతకీ ఆ బాధితుడి పేరు మనోజ్ కుమార్, మే 13 న కోవిడ్ -19 తో మరణించాడు. ఇతని మృతదేహాన్ని ఇలా చెత్త బండిలో వేసి శ్మశాన వాటికకు తరలించారు.

ఆ వీడియో మీరూ ఇక్కడ చూడొచ్చు..

ఈ సంఘటనపై నలంద సివిల్ సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించారు. సరైన దర్యాప్తు తర్వాత ఈ సంఘటనలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ”కోవిడ్ బాధితుడి మృతదేహాన్ని చెత్త బండిపై శ్మశానవాటికకు తీసుకెళ్లినట్లు నాకు తెలిసింది. మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి మాకు 200 కి పైగా వాహనాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇలా చేశారనేది తెలియడం లేదు. ఈ విషయంపై సరైన దర్యాప్తు జరిపి సంఘటనకు బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకుంటారు ఈ సంఘటనలో పాల్గొన్న వారు “అని డాక్టర్ కుమార్ అన్నారు. ఈ మృత దేహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ చివరి కర్మలు చేయమని కోరినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ చివరి కర్మల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసిండి. క్లెయిమ్ చేయని మృతదేహాల చివరి కర్మలను కార్పొరేషన్ నిర్వహిస్తుంది. మృతదేహాన్ని మునిసిపల్ వాహనం నుంచి తీసుకుంటామని వార్డు కౌన్సిలర్ ప్రజలకు చెప్పారు. అంతకుముందు, కూడా కోవిడ్ బాధితుల మృతదేహాన్ని చెత్త బండ్లపై తీసుకువెళ్ళిన కొన్ని కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, బీహార్లో 82,487 క్రియాశీల COVID-19 కేసులు ఉండగా, ఇప్పటివరకు 5,58,785 మంది ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మరణాల సంఖ్య 3,743 కు పెరిగింది.

Also Read: హైదరాబాద్‌ చెరువుల్లో కరోనా ఆనవాళ్లు… నీటిని తాకారో కరోనా గ్యారంటీ… ( వీడియో )

Vaccination: ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన నగరాల్లో అదుపులో కరోనా వైరస్..