Covid-19 Vaccine: వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకూ 17 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ..

India Coronavirus vaccination Updates: దేశంలో కరోనావైరస్ కేసులతోపాటు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్

Covid-19 Vaccine: వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఇప్పటివరకూ 17 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ..
Covid 19 vaccine
Follow us
Shaik Madar Saheb

| Edited By: Janardhan Veluru

Updated on: May 11, 2021 | 11:20 AM

India Coronavirus vaccination Updates: దేశంలో కరోనావైరస్ కేసులతోపాటు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్‌ మరో మైలురాయిని అధిగ‌మించింది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 17 కోట్లకుపైగా మోతాదులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ డోసులన్నీ కూడా రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపింది. ఆదివారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా 17కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొంది. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు 95,46,871 మందికి మొదటి డోసు ఇవ్వగా.. మరో 64,71,090 మందికి రెండో డోసు అందించినట్లు తెలపింది. 1,39,71,341 ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదటి డోసు, 77,54,283 రెండో డోసు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి 20,29,395 మొదటి డోస్‌ వేసినట్లు పేర్కొంది. 45-60 ఏళ్ల మధ్య ఉన్న 5,51,74,561 మంది లబ్ధిదారులకు తొలిడోసు ఇవ్వగా.. 65,55,714 మందికి రెండో డోసు కూడా అందజేసినట్లు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన 5,36,72,259 మందికి తొలి డోసు, 1,49,77,918 మందికి రెండో డోసు వేసినట్లు వివరించింది. 18-44 మధ్య వయస్సు ఉన్నవారికి ఆదివారం ఒకే రోజు 2,43,958 మందికి టీకా ఇచ్చారు. ఇప్పటి వరకు 20,29,395 మందికి తొలి డోసు వేసినట్లు తెలిపింది.

టీకా డ్రైవ్‌ ఆదివారం 114వ రోజుకు చేరగా.. ఒకే రోజు 6,71,646 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో చాలా రాష్ట్రాలు టీకాలు వేయలేదు. ఇదిలా ఉండగా.. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాదాపు 18 కోట్ల వ్యాక్సిన్లు ఉచితంగా సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో 9 లక్షల డోసులు అందజేస్తామని పేర్కొంది.

Also Read:

Young Doctor Dies: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం.. కూర్చున్నచోటే కుప్పకూలిన యువ డాక్టర్.. గంటల వ్యవధిలో గాలిలో కలిసిన ప్రాణాలు

Azam Khan: ఎంపీ అజామ్ ఖాన్, ఆయన కుమారుడికి కరోనా.. జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు