అమ్మ బాబోయ్.. ట్రంప్ చెప్పాడని అందులో ఇన్వెస్ట్ చేశారు.. కట్ చేస్తే..
ఆ సైబర్ చీటర్స్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర మోసానికి పాల్పడ్డారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లుగా వీడియోను సృష్టించి మోసాలకు తెగబడ్డారు. కర్ణాటకలో దాదాపు 150 మందిని నమ్మించి రూ.కోటికి పైగా దోచుకున్నారు. ఇది ఎలా జరిగింది.. ఏంటి డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం...

ఏఐ టెక్నాలజీ సైబర్ నేరగాళ్లపాలిట వరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నట్లుగా వీడియోలు సృష్టించిన సైబర్ చీటర్స్ పలువురి నెత్తిన శఠగోపం పెట్టారు. తనపేరుతో యాప్ రూపొందించానని.. ఇన్వెస్ట్‌మెంట్ పెడితే అధిక లాభాలు ఖాయమంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సైబర్ చీటర్స్. ఈ వీడియోల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడారు చీటర్స్. ఈ వీడియోలను ట్రంప్ మాట్లాడినవిగా నమ్మారు కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరు, హవేరి ప్రాంతాలకుచెందిన 150 మంది. వీడియోలో చూపెట్టిన నంబర్‌కు ఫోన్ చేసి యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ప్రభుత్వం జారీచేసినవి చెబుతూ నకిలీ రిసీప్ట్‌లను వీరికి పంపించారు సైబర్ చీటర్స్. వీరిని నమ్మించడానికి కొన్ని నెలలపాటు లాభాలు వచ్చినట్లుగా చూపిస్తూ.. డబ్బు, గిఫ్ట్‌లను సైతం అందించారు.
ఇటీవల యాప్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే సమాధానం రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు ఈ కర్నాటక ఇన్వెస్టర్స్. సైబర్ చీటర్స్ కోటిరూపాయలకుపైగా వీరి నుంచి దండుకుని మాయమయ్యారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ యాప్‌లు, కంపెనీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
