Fuel Price: ధరల నియంత్రణకు మోడీ సాహసోపేత నిర్ణయం.. ఇంధన ధరల తగ్గింపుతో శ్రీకారం..
Fuel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజీల్‌పై ఒకేసారి రూ.5, రూ. 10 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నసంచలన నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ...
Fuel Price: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజీల్‌పై ఒకేసారి రూ.5, రూ. 10 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నసంచలన నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆకాశమే హద్దుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ మోడీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అయితే పేరుకు తక్కువగానే తగ్గినట్లు కనిపించినా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా పన్నులు తగ్గించడంతో కొన్ని రాష్ట్రాల్లో ధరలు మరింత తగ్గాయి. ఉదాహరణకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మణిపుర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖాండ్ కేంద్రం తగ్గించిన దానికి అదనంగా మరికొంత ధరలను తగ్గించాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ పై సుమారు రూ. 12 వరకు తగ్గింది.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇలా ఒకేసారి పన్నులు తగ్గించడానికి పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో ఏర్పడ్డ ఆదాయ నష్టాన్ని పూడ్చడానికే 2020, 2021లో ఇంధనంపై పన్నులు పెంచుతూ పోయింది. అయితే తదనంత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం, ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోవడంతో దేశం ఆర్థికంగా మెరుగుపడింది. అదే సమయంలో జీఎస్‌టీ వసూళ్లు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇవి కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకుందనడానికి నిదర్శనంగా నిలిచాయి. ఇక ఇంధన ధరల పెరుగుదల ఇతర వస్తువులపై కూడా పడింది. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలకు కూడా రెక్చలొచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇంధన ధర తగ్గుదుల ఇతర ధరల స్థీకరణ కోసమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పేరుతో దేశంలోని వస్తువుల ఎగుమతులకు ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న తరుణంలో లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గించుకోవాల్సిన అసరం ఏర్పడింది. అలాగే పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని కొన్ని అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఇక మోడీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలతో కరోనా తర్వాత దేశం ఆర్థికంగా పుంజుకోవడం, ప్రైవేటీకరణ కారణంగా అధికా పన్నులు వసూలు అవుతుండడం కూడా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కారణంగా మారుతుంది, ఈ కారణంగానే ఇంధన ధరలతో పన్నులు తగ్గించినా ఖాజనాపై భారం పడదనేది మరికొందరి వాదనగా తెలుస్తోంది. మరి మోడీ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో చూడాలి.
Also Read: Adipurush : ఆదిపురుష్ సెట్లో సంబరాలు చేసుకుంటున్న ప్రభాస్… ఓంరౌత్.. ఎందుకంటే..
PM Narendra Modi: నౌషేరా చేరుకున్న ప్రధాని మోడీ.. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు..