AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush : ఆదిపురుష్ సెట్‏లో సంబరాలు చేసుకుంటున్న ప్రభాస్… ఓంరౌత్.. ఎందుకంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్‏కు జోడిగా

Adipurush : ఆదిపురుష్ సెట్‏లో సంబరాలు చేసుకుంటున్న ప్రభాస్... ఓంరౌత్.. ఎందుకంటే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Nov 04, 2021 | 1:14 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్‏కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్‌ అలీఖాన్‌, సీత పాత్రలో నటిస్తోన్న కృతి సనన్‌ షూటింగ్ పూర్తిచేశారు..

ఇక తాజాగా రాముడి పాత్రలో నటిస్తోన్న ప్రభాస్ కూడా తన పాత్ర షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా.. చిత్రయూనిట్.. డైరెక్టర్ ఓంరౌత్‏తో కలిసి ప్రభాస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ప్రభాస్ పాత్రను చూసేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ట్వీట్..

ఇక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు రెబల్ స్టార్ చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా సినిమాలు కావడమే విశేషం. ఇక మరోవైపు కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. ఇవే కాకుండా.. సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా చేయనున్నాడు.. ఇక ప్రభాస్… పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా నిర్మాణాంతర పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని మరింత పెంచాయి.

Also Read: Allu Arjun & Ram Charan: వెలుగుల దీపావళి.. మెగా – అల్లు కుటుంబాల పండగ సెలబ్రెషన్స్.. ఫోటోస్ వైరల్..

Peddanna Twitter Review: పెద్దన్న ట్విట్టర్ రివ్యూ.. రజినీకాంత్ సినిమా పై ఆడియన్స్ ఓపెనియన్..

Samantha: టపాసులను బ్యాన్ చేయకండి.. సద్గురు మాటలకు సమంత మద్దతు..