AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Live: బిగ్‌ డే.. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ ప్రారంభం..

Parliament Monsoon Session Live: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.. ఇంతకాలం వాయిదాల పర్వం కొనసాగగా.. సోమవారం పార్లమెంటులో కీలక చర్చ జరగనుంది.. ఆపరేషన్ సింధూర్‌పై మ.12 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక చర్చను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఇండియా- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వాదనలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2025 | 2:25 PM

Share

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.. ఇంతకాలం వాయిదాల పర్వం కొనసాగగా.. సోమవారం పార్లమెంటులో కీలక చర్చ జరగనుంది.. ఆపరేషన్ సింధూర్‌పై మ.12 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక చర్చను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్‌ తో ప్రతిదాడికి దిగింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివేంజ్‌ తీర్చుకుంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వాదనలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై సుధీర్ఘ చర్చ జరగనుంది.

ఆపరేషన్ సింధూర్‌పై 16 గంటలపాటు లోక్‌సభలో చర్చిస్తారు. దీంతో సభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీలకు విప్‌ జారీ అయింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు ఎంపీలకు విప్‌ జారీచేశాయి. మరోవైపు ఎన్డీయే, ఇండికూటమి పార్లమెంటు పార్టీ నేతల వేర్వేరు సమావేశాలు నిర్వహించాయి.. సభలో వ్యూహాలపై రెండు కూటముల నేతలు ఇప్పటికే చర్చించారు.

కాగా.. లోక్‌సభలో జరిగే చర్చలో హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే సహా పలువురు నేతలు పాల్గొంటారు. లోక్‌సభ, రాజ్యసభలో జరిగే చర్చలో ప్రధాని మోదీ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి చర్చలో పాల్గొంటారు. టీడీపీకి 30 నిమిషాల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. రేపు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సాగనుంది. ఈ చర్చలో రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొంటారు.

పాకిస్తాన్ పై భారత్ రివేంజ్..

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆపరేషన్ సింధూర్‌ అంటూ ప్రతిదాడికి దిగింది భారత్.. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివేంజ్‌ తీర్చుకుంది.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!