Goods Train Accident: ఝాజ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం.. గూడ్స్ బోగీ కింద పడి ఆరుగురు మృతి..

బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన యావత్‌ దేశాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ఒడిశా రైలుప్రమాదం మరువక ముందే అదే రాష్ట్రంలో ఝాజ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలుకింద పడి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.

Goods Train Accident: ఝాజ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం.. గూడ్స్ బోగీ కింద పడి ఆరుగురు మృతి..
Odisha Train Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 07, 2023 | 9:18 PM

బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటన యావత్‌ దేశాన్ని విషాదంలోకి నెట్టివేసింది. ఒడిశా రైలుప్రమాదం మరువక ముందే అదే రాష్ట్రంలో ఝాజ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలుకింద పడి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. బాలాసోర్‌ రైలు ప్రమాదం యావత్‌ దేశాన్ని కదిలించింది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మహా విషాదం మనల్ని ఇంకా వీడక ముందే.. అదే రాష్ట్రం ఒడిశాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్సు రైలు కింద పడి ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ఒడిశాలోని ఝాజ్‌పూర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అక్కడే రైల్వే ట్రాక్‌ మరమ్మత్తు పనులు చేస్తోన్న రైల్వే కూలీలు వర్షం నుంచి కాపాడుకునేందుకు ఆగిఉన్న గూడ్సు కిందకు చేరి విశ్రాంతి తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది.

గత కొంతకాలంగా ఇంజన్‌లేని గూడ్సు ట్రైను.. పక్కనే ఉన్న సేఫ్టీ ట్రాక్‌పై నిలిపి ఉంది. వర్షం పడడంతో గూడ్సు రైలుకిందకు వెళ్ళి తలదాచుకున్నారు రైల్వే కూలీలు. ఓ వైపు వర్షం. మరోవైపు తీవ్రమైన ఈదురుగాలులు…దీంతో హఠాత్తుగా ఆగి ఉన్న గూడ్సు రైలు ముందుకు కదిలింది. దీంతో… గూడ్స్‌ కింద ఉన్న ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈదురుగాలులకు బోగీలు ముందుకు కదలడంతో ఊహించని ప్రమాదానికి గురయ్యారు ఆరుగురు కూలీలు. ఈ విషాద వార్త కూలీజనం కుటుంబాల్లో అంతులేని విషదాన్ని నింపింది. బాలాసోర్‌ ఘటనలో ఇప్పటికే 288 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మరో ప్రమాదం స్థానికులను హడలెత్తిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు