Crime: పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన క్రిమినల్.. ఏకంగా 24 ఏళ్ల తర్వాత చిక్కాడు
సాధారణంగా ఏదైనా నేరంలో నిందితుడిగా తేలితే అతనిని వెంటనే అరెస్టు చేస్తారు. ఆచూకీ దొరకకపోతే దర్యాప్తు వేగవంతం చేసి వీలైనంత త్వరగా పట్టుకుంటారు. కానీ ఒడిశాలో ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు ముప్పుతిప్పలు...
సాధారణంగా ఏదైనా నేరంలో నిందితుడిగా తేలితే అతనిని వెంటనే అరెస్టు చేస్తారు. ఆచూకీ దొరకకపోతే దర్యాప్తు వేగవంతం చేసి వీలైనంత త్వరగా పట్టుకుంటారు. కానీ ఒడిశాలో ఓ వ్యక్తి మాత్రం పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఒడిశా(Odisha)లోని బెర్హంపూర్ ప్రాంతానికి చెందిన శంకర్ బిస్వాల్.. రెండు దశాబ్దాల క్రితం జరిగిన క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో దాదాపు 24 ఏళ్ల తర్వాత శంకర్ బిస్వాల్ ను గంజాం జిల్లాలోని అతని సొంత గ్రామంలో పట్టుకున్నారు. ఖల్లికోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసిపూర్ గ్రామంలో దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పక్కాగా అదుపులోకి తీసుకున్నారు. పలు నేరారోపణలు నమోదైన తర్వాత బిస్వాల్ కేరళలో రోజువారీ కూలీగా పనిచేసే వాడని గుర్తించారు.
1998లో జరిగిన రెండు హత్యలు, 10 హత్యాప్రయత్నాలు, ఒక దొంగతనం కేసుల్లో బిస్వాల్ నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతడిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు శంకర్ బిస్వాల్ ను అరెస్టు చేసేందుకు ఒక బృందాన్ని కేరళకు పంపించి పట్టుకున్నారు.
పరారీలో ఉన్న 24 ఏళ్ల జీవితంలో బిస్వాల్.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కేరళలో రోజువారీ కూలీగా పనిచేశాడని ఖల్లికోట్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ జగన్నాథ్ మల్లిక్ వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..