ఏటీఎం నుండి రూ.500 విత్‌డ్రాకు చేస్తే రూ.2500 ..! ఎగబడ్డ జనాలు, ఎక్కడంటే..
ఏటీఎం నుండి రూ. 500 విత్‌డ్రా చేస్తే.. రూ. 2,500 వచ్చాయి. అడిగిన దాని కంటే ఐదు రెట్లు ఎక్కువ కరెన్సీ నోట్లను వెదజల్లింది ఆ ఏటీఎం. అలా ఒక్కసారి, రెండు సార్లు కాదు.. నాలుగైదు సార్లు జరిగింది.. ఇంకేముంది.. ఈ వార్త క్షణాల్లో
ఏటీఎం నుండి రూ. 500 విత్‌డ్రా చేస్తే.. రూ. 2,500 వచ్చాయి. అడిగిన దాని కంటే ఐదు రెట్లు ఎక్కువ కరెన్సీ నోట్లను వెదజల్లింది ఆ ఏటీఎం. అలా ఒక్కసారి, రెండు సార్లు కాదు.. నాలుగైదు సార్లు జరిగింది.. ఇంకేముంది.. ఈ వార్త క్షణాల్లో ఇట్టు పక్కల వ్యాపించింది. దాంతో జనం ఆ ఏటీఎం వద్దకు బారులు తీరారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రూ.500 విత్‌డ్రా చేయగా ఖపర్‌ఖేడాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రూ.2,500 వచ్చింది. ఈ వార్త విన్న వారంతా డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఏటీఎం ముందు జనం, సందడిని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వచ్చి ఏటీఎం మూసేశారు. బ్యాంకుకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
చాలా మంది ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. బ్యాంకర్లు వచ్చి యంత్రాన్ని పరిశీలించగా లోపం బయటపడింది. ఏటీఎంలో రూ.100 పెట్టాల్సిన ట్రేలో 500 నోట్లను ఉంచడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందుకే రూ.500 విత్ డ్రా చేసుకున్న వారికి రూ.500 ఐదు నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి