సుదీర్ఘకాలంగా ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న అధికారిని, ఇసుక లీలలు అన్నీఇన్నీ కావు..

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో ఇసుక అక్రమ రవాణాకు ఇరిగేషన్ అధికారులు తెరలేపారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి చిత్రావతి నది లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయింది. గత 7 నెలలుగా ఇసుక రీచ్ మూతపడింది.

సుదీర్ఘకాలంగా ఇరిగేషన్‌ శాఖలో పనిచేస్తున్న అధికారిని, ఇసుక లీలలు అన్నీఇన్నీ కావు..
Atp
Follow us

|

Updated on: Jun 16, 2022 | 12:50 PM

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లో ఇసుక అక్రమ రవాణాకు ఇరిగేషన్ అధికారులు తెరలేపారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి చిత్రావతి నది లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయింది. గత 7 నెలలుగా ఇసుక రీచ్ మూతపడింది. అప్పటి నుంచి జిల్లాకేంద్ర వాసులు ఇసుక రీచ్ లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకుని వస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా నిబంధనలు కఠినంగా ఉండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఎడ్లబండి పైన ఇసుక తీసుకు వస్తున్నా కూడా అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఇసుక దందాకు తెర లేపడం విమర్శలకు దారితీస్తోంది.

పట్టపగలే జెసిబి సహాయంతో ఇసుక అక్రమ రవాణాకు తెర లేపారు. ఈ తతంగమంతా జె ఈ జమునా భాయ్ కనుసన్నల్లో జరగడం గమనార్హం. ఇసుక మాఫియాతో జె ఈ జమునా భాయ్‌ జత కట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఏమని ఇరిగేషన్ జెఈ జమునాభాయ్ అడుగగా పర్మిషన్ అయితే లేదని , సొంత ఇంటి కోసం ఇసుక తోలుకుంటున్ననాని చెప్పడము ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సామాన్యులకు ఒక న్యాయం, అధికారులకు ఒక న్యాయమా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. చిత్రావతినదిలోకి మీడియా వెళ్లగా మీడియాతో మాట్లాడకుండా అటు నుంచి పలాయనం చిత్తగించారు. ఉన్నఫలంగా అక్కడ ఉన్న ట్రాక్టర్లు జెసిబి లు అన్నీ మీడియా ని చూసి జారుకున్నారు. అదే విధంగా చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉన్న కంకర సైతం జమునా బాయి చెక్ డ్యామ్ నిర్మాణం కోసం ఉంచిన కంకర సైతం పట్టపగలే ఇరిగేషన్ జె ఈ జమునాభాయ్ ట్రాక్టర్ తో తరలించడం విమర్శలకు దారి తీస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇలా అక్రమాలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని ఓవైపు నిబంధనలు విధించి ఎడ్ల బండ్ల యజమానులకు ఆంక్షలు విధిస్తున్న అధికారులు దగ్గరుండి జెసిబి సాయంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ తరలింపు చేపట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న జె ఈ జమునాభాయ్ అవినీతి అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతున్న సెబ్ అధికారులు సైతం చోద్యం చూస్తున్నారని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై స్పందించిన ఉన్నత అధికారులు ఇసుక తరలింపు పై ఆరా తీస్తున్నారు.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..