Elephant Rescue: అయ్యో పాపం.. మహానది మధ్యలో మదపుటేనుగు.. రక్షించేందుకు వెళ్లారు.. చివరికి ఏం జరిగిందంటే..
మహానది మధ్యలో మదపుటేనుగు చిక్కుకుంది. ఆరు గంటలకుపైగా గజేంద్ర మోక్షాన్ని తలపిస్తూ.. అక్కడే నిలిచిపోయింది. ఆ ఏనుగు మొర ఆలకించిన కొందరు స్థానికులు దాన్ని రక్షించేందుకు సాహసం చేశారు.
మహానది మధ్యలో మదపుటేనుగు చిక్కుకుంది. ఆరు గంటలకుపైగా గజేంద్ర మోక్షాన్ని తలపిస్తూ.. అక్కడే నిలిచిపోయింది. ఆ ఏనుగు మొర ఆలకించిన కొందరు స్థానికులు దాన్ని రక్షించేందుకు సాహసం చేశారు. హీరాకూడ్ డ్యామ్ నుంచి నీరు ఎక్కువగా వస్తుండటంతో వరద ఉధృతి మరింత పెరిగింది. పడవలో వెళ్లిన రెస్క్యూసిబ్బంది కూడా ప్రవాహ వేగానికి రిస్కులో పడ్డారు. అంతే.. ఒక్కసారిగా పట్టుదప్పి కిందపడిపోయారు రెస్క్యూ సిబ్బంది.
అప్పుడే కాస్త బలం పుంజుకున్న మదపుటేనుగు.. పడవబోల్తా పడిన వైపు దూసుకొచ్చింది. అక్కడ నీటివేగాన్ని ఎగదోస్తూ ప్రవాహాన్ని మరింత రెస్య్కూ టీమ్ వైపు బలంగా తోసి అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే ఆ నీటివేగానికి బోటులో వెళ్లిన స్థానిక జర్నలిస్ట్ అరిందమ్ దాస్ నదిలో పడి మృతి చెందారు. అతనితోపాటు ఉన్న వీడియో జర్నలిస్టు కూడా కిందపడిపోయాడు. అయితే.. కొందరు రెస్క్యూ టీమ్ అతన్ని రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఒడిషాలోని కటక్‌జిల్లా ముండలి వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది.
మహానది సమీపంలో ఉన్న అటవీప్రాంతం నుండి 17 ఏడుగులు అర్థరాత్రి నదిని దాటేందుకు ప్రయత్నించాయి. ప్రవాహ వేగం పెరగడంతో వాటిలో 10 ఏనుగులు నీటిలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులు ఎలాగోలా బయటపడ్డాయి. కేవలం 3 ఏనుగులు ఆరు గంటలుగా అక్కడే ఉండిపోయాయి.
చివరకు మిగిలిన ఒకే ఒక ఏనుగు ఎంతకూ బయటకు రాకపోవడంతో.. దాన్ని ఎలాగైనా రక్షించాలని అటవీశాఖ సిబ్బందితోపాటు స్థానికులు నదిలోకి వెళ్లి రిస్కులో పడ్డారు. ఏనుగు ప్రాణాలు రక్షిద్దామని వెళ్లిన వారే ప్రాణాలమీదకి తెచ్చుకున్నారు. ఏనుగు కూడా వారిని మరింత అగాతంలోకి వెళ్లేలా నీటి ప్రవాహాన్ని తోయడంతో పడవ తలకిందులైంది. ఏనుగు మాత్రం సురక్షితంగా బయటపడింది.
ఇవి కూడా చదవండి: UPSC Results: విడుదలైన UPSC సివిల్ సర్వీస్ 2020 తుది ఫలితాలు.. సత్తాచాటిన తెలుగు తేజాలు..
CM KCR-CM Jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఒకే వేదికను పంచుకోనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..