Minister Amit Shah: శనివారం ఢిల్లీలో సహకార సంస్థల మెగా సదస్సు.. ప్రసంగించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..
కేంద్ర మంత్రి అమిత్ షా దేశ రాజధానిలో శనివారం జరిగే సహకార సంఘాల మొదటి మెగా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించనున్నారు. ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వ విజన్, రోడ్‌మ్యాప్ గురించి...
కేంద్ర కేబినెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 25న జరగనున్న సహకార సంస్థల మెగా సదస్సులో పాల్గొననున్నారు. సహకార రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన కేంద్రం ఈ రంగ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో, ప్రభుత్వ విజన్ ఏంటనే విషయాలను ప్రధానంగా అమిత్ షా వెల్లడించనున్నారు. ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వ విజన్, రోడ్‌మ్యాప్ గురించి ఆయన వివరించనున్నారు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఏడాది జూలైలో సృష్టించబడిన కొత్త సహకార మంత్రిత్వ శాఖకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా షా ప్రసంగించాల్సిన మొదటి సెహకరిత సమ్మేళనం లేదా జాతీయ సహకార సమావేశం ఇదే కావడం విశేషం.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగనుంది. కాన్ఫరెన్స్ సహకార సంస్థలు IFFCO, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, NAFED, KRIBHCOతోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమానికి సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ మరియు అంతర్జాతీయ సహకార కూటమి (గ్లోబల్) అధ్యక్షుడు ఏరియల్ గార్కో కూడా హాజరవుతారు. దాదాపు 2వేల మందికి పైగా ఈ సదస్సులో ప్రత్యేకంగా పాలుపంచుకోనుండగా.. 8 కోట్ల మంది వర్చువల్‌గా పాల్గొంటున్నారు. 110 దేశాల్లోని 3 మిలియన్ల సహకార సంస్థలు భాగమైన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ (గ్లోబల్) సంస్థ కూడా వర్చువల్‌గా ఈ సదస్సులో పాల్గొననున్నట్లు ఐఎఫ్‌ఎఫ్‌సీవో(IFFCO) తెలిపింది.
ప్రపంచ స్థాయిలో భారతీయ సహకార సంఘాలను బలోపేతం చేయడంలో ఈ సమావేశం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఇది పని చేస్తుందని ఇఫ్కో ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం… ప్రత్యేక పరిపాలన, చట్టపరమైన మరియు విధాన ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం మరియు బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (MSCS) అభివృద్ధిని ప్రారంభించడానికి ప్రక్రియలను క్రమబద్ధీకరించడం మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన మంత్రం.
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी कल (25 सितंबर, 2021) ‘राष्ट्रीय सहकारिता सम्मेलन’ को संबोधित करेंगे।
समय: सुबह 11 बजे स्थान: आईजीआई स्टेडियम, नई दिल्ली#SahkarSeSamriddhi@MinOfCooperatn pic.twitter.com/P943HJRv1O
— Office of Amit Shah (@AmitShahOffice) September 24, 2021
ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..
CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..