Amazon Festival Sale: అమెజాన్‌లో ఆఫర్ల వెల్లువ.. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్స్ పేరుతో బంపర్ ఆఫర్లు.. అమ్మకాలు ఎప్పటి నుంచంటే..

Amazon Great Indian Festive Sale: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్‌కు రెడీ అవుతోంది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా భారీ ఆఫర్ ప్రకటించింది. ఏటా ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట...

Amazon Festival Sale: అమెజాన్‌లో ఆఫర్ల వెల్లువ.. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్స్ పేరుతో బంపర్ ఆఫర్లు.. అమ్మకాలు ఎప్పటి నుంచంటే..
Amazon Festival Season
Follow us

|

Updated on: Sep 24, 2021 | 6:09 PM

Amazon Sales: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్‌కు రెడీ అవుతోంది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా భారీ ఆఫర్ ప్రకటించింది. ఏటా ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట నిర్వహించే సేల్‌ తేదీలను అమెజాన్ ప్రకటించింది. అక్టోబర్‌ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు ముందుగానే డీల్స్‌ను అందుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

తాజాగా గ్రేట్ ఇండియన్‌ సేల్‌ పేరుతో అమెజాన్ కూడా అమ్మకాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ టీవీలు వంటి వాటిపై అమెజాన్‌ భారీ తగ్గింపులతో ఆఫర్ చేస్తోంది. అమెజాన్‌ ఎకో, ఫైర్‌ స్టిక్‌, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. దీంతో పాటు యాపిల్‌, ఆసుస్‌, ఫాజిల్‌, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను సేల్‌లో భాగంగా లాంచ్‌ చేయనున్నారు.

దేశ వ్యాప్తంగా అమ్మకందారులు.. 

దేశ వ్యాప్తంగా మొత్తం 450 నగరాల్లోని 75,000 స్థానిక దుకాణదారులు ఇందులో అమ్మకాలు.. వీరితోపాటు మరో లక్షలాది మంది విక్రేతలు ఈ సేల్స్‌లో పాల్గొంటారని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ తెలిపారు.

నీల్సన్ సర్వే..

నీల్సన్ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం 98% మంది విక్రేతలు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని తెలిపింది.ఈ ప్రభావం ఇ-కామర్స్ సంస్థల వ్యాపారంపై సానుకూలంగా ప్రభావం చూపించిందని తాజా సర్వేలో పేర్కొంది.

అమెజాన్ పోటీ..

ప్రముఖ ఇ-కామర్స్‌ సైట్స్‌లో అమెజాన్ పోటీదారు ఫ్లిప్‌కార్ట్‌ కూడా పండుగ ఆఫర్లతో దూసుకు వస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: JC vs MLC Jeevan: రాజకీయాలు మాట్లాడాలంటే బయటే చూసుకోవాలి.. జేసీకి క్లాస్ పీకిన ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి..

CM Jagan: వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్..