Harsh Vardhan: అనవసర రాజకీయాలు చేస్తున్నారు.. ఆ వ్యాక్సీన్లన్నీ రాష్ట్రాలకే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ 

Harsh Vardhan on phase 3 Corona vaccination: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రం, విపక్షాల మధ్య మాటల యుద్ధం

Harsh Vardhan: అనవసర రాజకీయాలు చేస్తున్నారు.. ఆ వ్యాక్సీన్లన్నీ రాష్ట్రాలకే: కేంద్ర మంత్రి హర్షవర్ధన్ 
harsh vardhan
Follow us

|

Updated on: Apr 26, 2021 | 9:09 AM

Harsh Vardhan on phase 3 Corona vaccination: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పందించారు. రాజకీయాలు తగదంటూ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సుదీర్ఘమైన అంశాలతో ట్విట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా వ్యాక్సిన్లు ఎవరికీ ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రాల కంటే కేంద్రానికి టీకాలు తక్కువ ధరకే లభిస్తున్నాయన్న విపక్షాల ఆరోపణలను కొట్టి పారేశారు. భారత ప్రభుత్వం వద్ద ఉన్న 50శాతం కోటా వ్యాక్సిన్లను రాష్ట్రాల ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్రానికి వ్యాక్సిన్లు చౌకగా లభిస్తున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అబద్దమని తెలిపారు.

ఇదిలాఉంటే.. ఇటీవల సీరం ఇన్‌స్టిట్యూట్‌ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600కు విక్రయించనున్నట్లు ప్రకటించింది. భారత్‌ బయోటెక్‌ కోవ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు రూ.600, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.1200 సరఫరా చేయనున్నట్లు తెలిపింది. అయితే.. ఈ రెండు కంపెనీలు.. ప్రస్తుతం వ్యాక్సిన్లను కేంద్రానికి రూ.150కే సరఫరా చేస్తున్నాయి. టీకా ధరలపై కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా లేవనెత్తిన ఆరు ప్రశ్నలపై ఆయన స్పందించారు.

హర్షవర్ధన్ చేసిన ట్విట్..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ 18 ఏళ్లుపైబడిన అన్ని వయసుల వారికి మే ఒకటిన ప్రారంభమయ్యే మూడో దశ వ్యాక్సినేషన్‌పై సుదీర్ఘంగా రాశారు. వ్యాక్సిన్లపై అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. దీంతోపాటు.. కేంద్రానికి సంబంధించిన 50శాతం కోటాపై వివరణ ఇచ్చారు. బ్యాలెన్స్‌ 50 శాతం కోటా కార్పొరేట్‌, ప్రైవేటు రంగానికి అవసరమైన వనరులను సమకూర్చడానికి, సాధ్యమైనంత త్వరగా టీకాలు వేసేందుకు వీలు కల్పిస్తుందంటూ వివరణ ఇచ్చారు.

అర్హత ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయడానికి కేంద్రం రాష్ట్రాలకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రైవేటు కేంద్రాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయగలిగే వ్యక్తులు టీకా పొందే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు.

Also Read:

Corona Vaccine Registration: 18 ఏళ్లు నిండి వారు వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్నారా..! అయితే ఇలా పేర్లు నమోదు చేసుకోండి..

గుంటూరులో దారుణం.. మీవాళ్లు బతకాలంటే మీ ఆక్సిజన్‌ మీరే తెచ్చుకోండి.. పరుగులు పెడుతున్న కోవిడ్ రోగుల బంధువులు..!