గుంటూరులో దారుణం.. మీవాళ్లు బతకాలంటే మీ ఆక్సిజన్ మీరే తెచ్చుకోండి.. పరుగులు పెడుతున్న కోవిడ్ రోగుల బంధువులు..!
ఓవైపు కరోనా మహమ్మారితో పోరాటం.. మరోవైపు ఆక్సిజన్ లేక బతుకే నరకం. గుంటూరు సిటీ ఆస్పత్రిలో లైవ్ సిచువేషన్ ఇది. మీవాళ్లు బతకాలంటే మీ ఆక్సిజన్ మీరే తెచ్చుకోండి అంటూ తెగేసి చెప్పేసింది.
Guntur oxygen shortage: ఓవైపు కరోనా మహమ్మారితో పోరాటం.. మరోవైపు ఆక్సిజన్ లేక బతుకే నరకం. గుంటూరు సిటీ ఆస్పత్రిలో లైవ్ సిచువేషన్ ఇది. మీవాళ్లు బతకాలంటే మీ ఆక్సిజన్ మీరే తెచ్చుకోండి అంటూ తెగేసి చెప్పేసింది.
గుంటూరులో పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ముఖ్యంగా గుంటూరులోని సిటీ ఆస్పత్రిలో ఆక్సీజన్ సరఫరా పడిపోవడంతో.. పేషెంట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 15మంది కోవిడ్ పేషెంట్లు విలవిల్లాడారు. దీంతో పేషెంట్ల బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీ వాళ్లు బతకాలంటే.. వెళ్లి ఆక్సీజన్ తెచ్చుకోండి. ఎవరు ఆక్సిజన్ తెచ్చుకుంటే వారి పేషెంట్‌కు అమరుస్తాం అంటూ సింపుల్‌గా చెప్పేశారు. దీంతో వారు పరుగు పరుగున ఆక్సిజన్ ప్లాంట్లకు చేరుకున్నారు. ఆస్పత్రి వర్గాలు రాసిచ్చిన లెటర్స్ తీసుకొచ్చి సిలిండర్లు పట్టుకువెళ్లారు.
ఇలా ఒక్కొక్కరిది ఒక్కో బాధ. తమ వారిని రక్షించుకునేందుకు అర్ధరాత్రి ఆక్సీజన్ ప్లాంట్ల చుట్టూ తిరిగారు పేషెంట్ల బంధువులు. ఆస్పత్రి వర్గాలు మాత్రం ప్రాణవాయువును పసమకూర్చుకునే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. మీఇష్టం ఆక్సిజన్ తెచ్చుకోండి లేకపోతే.. డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లండని సింపుల్‌గా చెప్పేశాయి. తీరా ఆక్సిజన్ కోసం వస్తే ఒక్కో సిలిండర్ నింపడానికి రెండు నుంచి మూడు గంటలు పట్టడంతో పేషెంట్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది.