AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cordelia Cruise Ship: క్రూయిజ్ షిప్‌పై చల్లారని రాజకీయ దుమారం.. పాండిచ్చేరి ప్రభుత్వం మరోసారి..

తమిళ సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నేతలు షిప్‌ను నిషేధించాలన్న డిమాండ్లతో ఈ వ్యవహారం పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఈనెల 8న విశాఖ నుంచి బయలుదేరింది కార్డేలియా క్రూయిజ్‌. మరుసటి రోజు పాండిచ్చేరిలో హాల్ట్ కావాల్సి ఉంది.

Cordelia Cruise Ship: క్రూయిజ్ షిప్‌పై చల్లారని రాజకీయ దుమారం.. పాండిచ్చేరి ప్రభుత్వం మరోసారి..
Cordelia Cruise
Sanjay Kasula
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 13, 2022 | 11:21 AM

Share

విలాసవంతమైన కార్డేలియా క్రూయిజ్‌ షిప్‌కి తమ బార్డర్‌లో లంగర్‌ వేసేదే లే అని మరోసారి తేల్చి చెప్పింది పాండిచ్చేరి ప్రభుత్వం. ఈనెల 9న లగ్జరీ షిప్‌ హాల్టింగ్‌కి బ్రేకులేసిన లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై నిన్న మరోసారి అనుమతి నిరాకరించారు. తమిళ సంఘాలతో పాటు రాజకీయ పార్టీల నేతలు షిప్‌ను నిషేధించాలన్న డిమాండ్లతో ఈ వ్యవహారం పూర్తిగా పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఈనెల 8న విశాఖ నుంచి బయలుదేరింది కార్డేలియా క్రూయిజ్‌. మరుసటి రోజు పాండిచ్చేరిలో హాల్ట్ కావాల్సి ఉంది. టూరిస్ట్‌లు సిటీ సీయింగ్‌తో పాటు షాపింగ్‌ చేయాలనుకున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం క్రూయిజ్‌కి పర్మిషన్‌ ఇవ్వలేదు. దీంతో 12 గంటల పాటు కడలి అలల మధ్య ఉండిపోయింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్లిపోయింది. తిరిగి మళ్లీ విశాఖ చేరుకున్న షిప్‌.. నిన్న యధావిధిగా పాండిచ్చేరికి వెళ్లింది. కానీ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. క్రూయిజ్‌ను తమ సరిహద్దుల్లోకి అనుమతించబోమని మరోసారి పాండిచ్చేరి తేల్చి చెప్పింది .

క్రూయిజ్‌ షిప్ వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై. ఖరీదైన నౌకలో చాలా అంశాలు తమిళ సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్నాయన్నారు. షిప్‌ను నిషేధించాలని తమిళ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు నిరసన తెలుపుతున్నాయని గుర్తు చేశారు. అంతకుముందు క్రూయిజ్‌లో క్యాసినో, గ్యాంబ్లింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తమిళిసై స్పష్టం చేశారు.

సముద్రంలో ఇండియా వాటర్స్.. లేదంటే ఇంటర్నేషనల్ వాటర్స్ అని మాత్రమే ఉంటాయి. క్రూయిజ్‌కి కేంద్రం అనుమతులు ఇచ్చాక.. రాష్ట్రాల అనుమతులు అక్కర్లేదంటున్నారు అధికారులు. క్రూయిజ్ అన్నాక క్యాసినోలు, మద్యం కామన్ అంటున్నారు. కానీ పాండిచ్చేరి ప్రభుత్వం మాత్రం టూరిజం అభివృద్ధి మాటున యువత జీవితాన్ని పాడు చేసే కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటోంది. మరి ఈ సమస్యకు ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు ఎలా పడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..