Covid Vaccine: కరోనా వచ్చిన వారికి వ్యాక్సిన్‌ అవసరం లేదంట.. అధ్యయనంలో నిపుణులు ఏం తేల్చారు..!

Covid Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్‌ విషయంలో చాలా మందికి చాలా రకాలుగా అపోహాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కేంద్ర..

Covid Vaccine: కరోనా వచ్చిన వారికి వ్యాక్సిన్‌ అవసరం లేదంట.. అధ్యయనంలో నిపుణులు ఏం తేల్చారు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 11, 2021 | 12:41 PM

Covid Vaccine: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్‌ విషయంలో చాలా మందికి చాలా రకాలుగా అపోహాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వ్యాక్సినేష‌న్ విష‌యంలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఇందులో ఒక‌సారి క‌రోనా వచ్చిన వాళ్లకు వ్యాక్సిన్‌ అవసరం లేదనేది కీలక అంశం. ఇది చాలా మంది కరోనా బాధితులలో పలు సందేహాలకు కారణమైంది. గతంలో కరోనా వచ్చిన వాళ్లు మూడు నెలల వరకు వ్యాక్సిన్‌ తీసుకోకూడదని, వాళ్లకు సహజంగానే యాంటీబాడీలు ఉంటాయని నిపుణులు చెప్పారు. ఇప్పుడు మాత్రం ఎయిమ్స్‌ డాక్టర్లతో కూడిన నిపుణుల బృందం మాత్రం అసలు వారికి వ్యాక్సిన్‌ అవసరం లేదని చెప్పడం గమనార్హం. మరి నిజంగానే కోవిడ్‌ వచ్చిన వారికి వ్యాక్సిన్‌ అవసరం లేదా..? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

కోవిడ్‌ బాధితులకు వ్యాక్సిన్‌ ఎందుకు అవసరం లేదంటున్నారు..?

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో రీ ఇన్ఫెక్షన్లు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనంలో బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు అంటే ఒక డోసు లేదా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లకూ వైరస్‌ వచ్చిన సందర్భాలున్నాయి. దీని ప్రకారం.. కరోనా తీవ్రతను తగ్గిస్తాయి తప్ప అది పూర్తిగా రాకుండా మాత్రం అడ్డుకోలేవని స్పష్టమైంది. మరోవైపు ఒకసారి కరోనా బారిన పడిన వాళ్లు కనీసం పది నెల వరకైనా మళ్లీ ఆ ఇన్ఫెక్షన్‌ బారిన పడబోరని లాన్సెట్‌ జరిపిన మరో అధ్యయనంలో తేలింది. యూనివర్సిటీ కాలేజ్‌ లండన్లోని పరిశోధకులు ఈ అధ్యయనం జరిపారు. ఒకసారి కోవిడ్‌ బారిన పడిన వాళ్లు, ఇప్పటి వరకూ కరోనా సోకని వాళ్ల యాంటీబాడీ పరీక్షలు నిర్వహించారు. దీనిని బట్టి ఒకసారి కరోనా బారిన పడినవాళ్లు పది నెలల వరకు సురక్షితమని తేల్చారు పరిశోధకులు.

నిపుణుల బృందం సూచనలు ఇవ్వడానికి ప్రధానంగా వ్యాక్సిన్‌ల కొరతే కారణంగా కనిపిస్తోంది. అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం కంటే ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వడమే మేలని ఈ బృందం చెబుతోంది. అందుకే ఇప్పటి వరకు వైరస్‌ బారిన పడిన వాళ్లను ప్రస్తుతానికి వ్యాక్సినేషన్‌ నుంచి తొలగిస్తే పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని తన నివేదికలో తేలిపింది.

ఇవీ కూడా చదవండి:

Covishield: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య గడువు తగ్గించిన కేంద్రం ప్రభుత్వం.. వారికి మాత్రమే..!

Insurance Policy: టీకా తీసుకుంటేనే పాలసీ ఇస్తారా?.. కొత్త నిబంధనలు తీసుకువస్తున్న బీమా కంపెనీలు