Post Office Saving Schemes Fraud: పోస్టాఫీసులో పొదుపు పథకాల్లో మీకు మోసం జరిగిందా..? ఫిర్యాదు చేయండిలా

Post Office Saving Schemes Fraud: పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల పథకాలు అంబాటులో ఉన్నాయి. పలు రకాల స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడం, సేవింగ్‌ స్కీమ్‌లో చేరడం లాంటివి.

Post Office Saving Schemes Fraud: పోస్టాఫీసులో పొదుపు పథకాల్లో మీకు మోసం జరిగిందా..? ఫిర్యాదు చేయండిలా
Follow us

|

Updated on: Jun 11, 2021 | 1:33 PM

Post Office Saving Schemes Fraud: పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల పథకాలు అంబాటులో ఉన్నాయి. పలు రకాల స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టడం, సేవింగ్‌ స్కీమ్‌లో చేరడం లాంటివి చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో అన్ని రంగాలలో మోసాలు జరుగుతున్నాయి. పోస్టాఫీసులలో ఉన్న పలు స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టిన తర్వాత అనేక రకమైన మోసాలు జరిగే అవకాశాలుంటాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసిజర్‌ (ఎస్‌ఓపీ)ను ఓ సర్కూలర్‌ను జారీ చేసింది. పోస్టల్‌ శాఖలో చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే వ్యక్తికి మోసం జరిగినా.. ఏవైనా అవకతవకలు జరిగినా అందుకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు. మోసపోయిన వ్యక్తి పోస్టాఫీసు బ్రాంచ్‌ లేదా ఇ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి మోసానికి గురైన డబ్బులను తిరిగి చెల్లిస్తారు. అయితే మోసం కేసు వెలుగులోకి వచ్చిన మూడు రోజుల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులో జరిగిన మోసాలను నివేదించేందుకు కాలపరిమితి ఏమి లేదు. అలాగే మోసాన్ని నివేదించే ఏ హక్కుదారునికి లేదా వ్యక్తికి ఏ స్థాయిలో అసౌకర్యం ఉండకూదనే విషయం సర్క్యూలర్‌లో పొందుపర్చారు. ఫారం నింపిన మొదలు బాధితునికి పరిష్కారం అయ్యే వరకు అన్ని రకాల సహాయం అందుతుంది.

పోస్టాఫీసులో ఎలా ఫిర్యాదు చేయాలి..?

పోస్టాల్‌ విభాగంలో ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు చేసేందుకు ఫారమ్‌ను విడుదల చేసింది. అందులో మోసం లేదా లావాదేవీల విషయంలో జరిగిన అవకతవకలు, పోస్టల్‌ శాఖలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం కోల్పోయినట్లయితే తదితర అంశలపై ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఫిర్యాదు చేసే ఫారమ్‌లో పూర్తి వివరాలు వెల్లడించాలి. ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో కూడా క్లుప్తంగా వివరించాలి.

ఫారంతో పాటు ఫిర్యాదు చేసే వ్యక్తి ఫోటో గుర్తింపు కార్డు, చిరునామాకు సంబంధించిన ఫ్రూప్‌, పాన్‌ కార్డు, ఆధార్‌, ఏదైనా గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుంది. అంతేకాదు పాస్‌బుక్‌, డిపాజిటిట్‌ చేసిన రశీదు జిరాక్స్‌ను సైతం జాత చేయాలి. ఎవరైనా ఇ-మెయిల్‌ ద్వారా రిపోర్టు చేస్తే లేదా ఫారమ్‌ నింపినట్లయితే సరైన ఇ-మెయిన్‌ ఐడి, మొబైల్‌ నెంబర్‌, చిరునామా జత చేసి ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు మీ ఫిర్యాదును స్వీకరించిన పోస్టల్‌ అధికారులు విచారణ చేపడతారు.

ఫిర్యాదును అంగీకరించిన తర్వాత ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను ఇస్తారు. మీకు జరిగిన మోసాన్ని ధృవీకరించి మీ మొత్తాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు. అలాగే ఏదైనా ఫోరెన్సిక్‌ పరీక్షలు అవసరమైతే కాస్త ఆలస్యం అవుతుంది. 90 రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ స్కీమ్‌లో ఎలాంటి అవకతవకలు జరిగినా.. డబ్బులు మోసానికి గురైనా టెన్షన్‌ పడవద్దని, పూర్తి మొత్తం మీ ఖాతాల్లో జమ చేయబడుతుందని అధికారులు చెబుతున్నారు.

Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. వాహనదారులకు షాక్‌.. మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం