No FASTag: మీ వాహనానికి ఫాస్టాగ్ లేదా.? జర జాగ్రత్త.! అయితే డబుల్ టోల్ ట్యాక్స్ తప్పదు.!!

No FASTag: మీ వాహనానికి ఫాస్టాగ్ లేదా.? అయితే భారీ ఫైన్ తప్పదు.! ఇవాళ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే...

No FASTag: మీ వాహనానికి ఫాస్టాగ్ లేదా.? జర జాగ్రత్త.! అయితే డబుల్ టోల్ ట్యాక్స్ తప్పదు.!!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 15, 2021 | 4:30 PM

No FASTag: మీ వాహనానికి ఫాస్టాగ్ లేదా.? అయితే భారీ ఫైన్ తప్పదు.! ఇవాళ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలు NHAI టోల్ గేట్ల వద్ద డబుల్ ఛార్జీలు చెల్లించాలన్న విషయం విదితమే. అలాగే ఫైన్ కూడా తప్పదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఫాస్టాగ్ విషయమై వాహన యజమానులకు రాష్ట్ర రవాణా విభాగాలు సందేశాలను పంపించినట్లు తెలుస్తోంది.

అటు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ.. మోటారు వాహన చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీనితో ఫాస్టాగ్ లేకపోవడం అంటేనే చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడం అని లెక్క. దీనితో హైవేలపై వెళ్లకుండా రోడ్డుపైకి వచ్చిన వాహనాలు ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా తొలిసారి పట్టుబడితే రూ. 300 ఫైన్.. రెండోసారి పట్టుబడితే రూ. 500 ఫైన్ పడుతుందని రవాణాశాఖ స్పష్టం చేసింది. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్‌ను ఏప్రిల్ నెల కల్లా రెన్యువల్ చేసుకోవాలని తెలిపింది. కాగా, 2017 డిసెంబర్ నుంచి కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న కార్లకు ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉంటోంది. ఇక ఇప్పటిదాకా 75 లక్షల వాహనాలకు ఫాస్టాగ్ ఉండగా.. మరో 20 శాతం మంది హైవే రహదారులకు ఫాస్టాగ్‌లు లేవని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:

‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..