బ్రేకింగ్.. : ఘటన సమయంలో నేను మైనర్.. సుప్రీం మెట్లెక్కిన నిర్భయ దోషి
నిర్భయ దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు. ఎలాగైనా.. ఉరిశిక్ష అమలును రద్దు అయ్యేలా విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని.. వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరాడు పవన్ గుప్తా. మరోవైపు ఫిబ్రవరి 1వ తేదీన తీహార్ జైలులో […]
నిర్భయ దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు. ఎలాగైనా.. ఉరిశిక్ష అమలును రద్దు అయ్యేలా విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని.. వేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరాడు పవన్ గుప్తా. మరోవైపు ఫిబ్రవరి 1వ తేదీన తీహార్ జైలులో నిర్భయ దోషులైన నలుగురికి ఉరిశిక్ష అమలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ క్రమంలో పవన్ గుప్తా పిటిషన్ వేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.