నవభారత్ నిర్మాణమే లక్ష్యం.. పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రపతి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని.. ఈ దశాబ్దం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. గత సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించి చరిత్ర సృష్టించిందని.. అంతా కలిసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ బిల్లును […]

నవభారత్ నిర్మాణమే లక్ష్యం.. పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రపతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 31, 2020 | 12:03 PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉందని.. ఈ దశాబ్దం దేశ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. గత సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించి చరిత్ర సృష్టించిందని.. అంతా కలిసి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చామన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కొత్త బిల్లులను కూడా తీసుకొచ్చామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమన్న రాష్ట్రపతి.. రాజ్యంగం ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసనలకు దిగాయి. రాజ్యాంగాన్ని రక్షించండంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.