బెంగళూరులో లక్షల మంది బంగ్లాదేశీయులు.. ఎందుకు వచ్చారో తెలిస్తే షాక్..

దేశ వ్యాప్తంగా ఓ వైపు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసందే. అయితే ఈ క్రమంలో ఎన్నార్సీని కూడా అమలు చేయబోతున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ.. ఎన్నార్సీని కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెనక్కిపంపించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో.. దేశంలో వారు ఎంత మంది ఉన్నారన్న దానిపై చర్చకోనసాగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు సీపీ భాస్కర్‌రావు సంచలన విషయాల్ని బయటపెట్టాడు. కేవలం బెంగళూరు పట్టణంలో […]

బెంగళూరులో లక్షల మంది బంగ్లాదేశీయులు.. ఎందుకు వచ్చారో తెలిస్తే షాక్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 31, 2020 | 9:32 AM

దేశ వ్యాప్తంగా ఓ వైపు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసందే. అయితే ఈ క్రమంలో ఎన్నార్సీని కూడా అమలు చేయబోతున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ.. ఎన్నార్సీని కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను వెనక్కిపంపించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలో.. దేశంలో వారు ఎంత మంది ఉన్నారన్న దానిపై చర్చకోనసాగుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు సీపీ భాస్కర్‌రావు సంచలన విషయాల్ని బయటపెట్టాడు.

కేవలం బెంగళూరు పట్టణంలో మూడు లక్షల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా వచ్చి నివసిస్తున్నట్లు తెలిపారు. వీరంతా నిర్మాణ రంగ కార్మికుల రూపంలో.. 3 లక్షల కంటే ఎక్కువ మందే ఉన్నారని తెలిపారు. నిర్మాణ కార్మికులపై బెంగళూరు ఐఐఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సదస్సులో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు. బెంగళూరు నగరంలో అక్రమ చొరబాటుదారులు పెరిగిపోతున్నారన్నారు. ఇప్పటి వరకు 61 మంది బంగ్లాదేశీయుల్ని గుర్తించి నగరం నుంచి బహిష్కరించినట్లు సీపీ భాస్కర్‌రావు తెలిపారు. బెంగళూరు నగరం ఎకనామిక్ హబ్ అయినందుకే ఇక్కడికి వచ్చినట్లు వారు విచారణలో తెలిపారన్నారు.