NIA: PFI కేసులో రిమాండ్ రిపోర్టును సమర్పించిన ఎన్ ఐఎ.. వెలుగులోకి సంచలన విషయాలు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన NIA దాడుల్లో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. భారీ కుట్రలు దాగి ఉన్నాయని NIA తేల్చింది. రెండు రాష్ట్రాల్లో దాడులు చేసిన NIA అధికారులు నలుగురు నిందితులు ఫిరోజ్‌, ఉస్మన్‌, ఇమ్రాన్‌, సమీర్‌లను అరెస్ట్ చేసి కోర్టులో..

NIA: PFI కేసులో రిమాండ్ రిపోర్టును సమర్పించిన ఎన్ ఐఎ.. వెలుగులోకి సంచలన విషయాలు..
Nia
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 21, 2022 | 9:51 AM

NIA: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన NIA దాడుల్లో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. భారీ కుట్రలు దాగి ఉన్నాయని NIA తేల్చింది. రెండు రాష్ట్రాల్లో దాడులు చేసిన NIA అధికారులు నలుగురు నిందితులు ఫిరోజ్‌, ఉస్మన్‌, ఇమ్రాన్‌, సమీర్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చింది. నిందితులను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం కోర్టులో రిమాండ్‌ రిపోర్ట్‌ను సమర్పించిన NIA కీలకాంశాలను వెలికి తీసింది. పీఎఫ్‌ ఐ కార్యకర్తలు అబ్దుల్‌ ఖాదర్‌తో కలిసి ఉగ్ర చర్యలకు కుట్ర చేశారని రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనాన్ని బయట పెట్టారు. దేహదారుఢ్య పరీక్షల పేరుతో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కత్తులతో, ఐరన్ రాడ్‌లతో దాడి చేసేలా శిక్షణ ఇవ్వడమే వీరి టార్గెట్‌ అని తేల్చారు. ఈ దాడుల కోసం పీఎఫ్ఐ క్యాడర్ పేరుతో కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందు కోసం పలు జిల్లాల్లో ప్రత్యేక సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు శిక్షణకు వచ్చే కార్యకర్తలను ఉగ్ర కుట్ర వైపు ఆకర్షించేలా అబ్దుల్‌ ఖాదర్‌ అండ్‌ టీమ్‌ తర్ఫీదు ఇస్తుంది. ముఖ్యంగా భారత ప్రభుత్వంపై కుట్రకు ప్లాన్‌ చేసినట్టు తేల్చారు.

మరో వైపు ఉద్వేగ పూరితమైన స్పీచ్‌లు, వీడియోలు చూపిస్తూ ఒక వర్గంపై కక్షలు పెరిగే విధంగా నిర్వాహకులు ఉసిగొల్పినట్టు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చివరకు న్యాయవ్యవస్థపైనా కూడా భారీ కుట్రకు ప్లాన్‌ చేసినట్టు ఆధారాలు సేకరించారు. ఇక చట్ట విరుద్దమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రజల నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూర్చినట్టు NIA అధికారులు తేల్చారు. అంతే కాకుండా భారీగా నిధులను దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఫైనల్‌గా ఈ కేసులో కీలక మైన వ్యక్తి అబ్దుల్‌ ఖాదర్‌ విచారణలో కుట్రకోణాన్ని బయట పెట్టాడని ఎన్‌ఐఏ రిమాండ్‌ రిపోర్ట్‌లో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..