విదేశాల నుంచి ఇండియాలో ప్రవేశించే జంతువులకూ నెగెటివ్ కోవిద్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి..ప్రభుత్వ ఆదేశాలు
విదేశాలనుంచి 'దిగుమతి అయ్యే' పిల్లులు, సింహాలు, చిరుతపులుల వంటి జంతువులకు కూడా నెగెటివ్ కోవిద్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించింది.
విదేశాలనుంచి ‘దిగుమతి అయ్యే’ పిల్లులు, సింహాలు, చిరుతపులుల వంటి జంతువులకు కూడా నెగెటివ్ కోవిద్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించింది. ఈ రిపోర్టు ఉన్న పక్షంలోనే వీటిని దేశంలోకి అనుమతించాలని ఫైనాన్స్ శాఖ గత నెల 30 న దేశ వ్యాప్తంగా గల కస్టమ్స్ అదికారులను ఆదేశించింది.కోవిద్-19 ని పూర్తిగా నిర్మూలించేంతవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్ఫష్టం చేసింది. ఆయా దేశాల్లో టెస్ట్ చేయించుకున్న 72 గంటల్లోనే వీటికి ఇండియాలో అనుమతి ఉంటుంది.. లేని పక్షంలో ఏ దేశం నుంచి వచ్చిందో తిరిగి అదే దేశానికి పంపివేయాలని కస్టమ్స్ అధికారులకు ఈ శాఖ సూచించింది.సంబంధిత ప్రాంతీయ అధికారులు గానీ, క్వారంటైన్ ఆఫీసర్స్ గానీ ఎనిమల్ క్వారంటైన్ సర్టిఫికేషన్ సర్వీసెస్ గానీ తప్పనిసరిగా ఈ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఇంపోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ను జారీ చేయాల్సి ఉంటుంది. విదేశాల నుంచి తమ పెంపుడు పిల్లులు, కుక్కలవంటి వాటిని చాలామంది ఇండియాకు తీసుకువస్తుంటారు. వీటికి కరోనా వైరస్ సోకితే స్థానిక జంతువులకు కూడా సోకే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
పిల్లులు, సింహాలు, చిరుతలు, గొరిల్లాల వంటి జంతువులకు ఈ వైరస్ సులభంగా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ప్రకటించింది. వీటి శరీర నిర్మాణం ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి ‘అనువుగా’ ఉంటుందని పేర్కొంది. గత నెలలో చెన్నై లోని వండలూర్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలోని 9 సింహాలకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. వీటిలో రెండు సింహాలు మరణించాయి. ప్రస్తుతం ఉన్న సింహాలను కూడా ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేస్తున్నారు. వాటి ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Bajrang Dal: గో రక్ష కార్యకర్తలపై దాడికి పాల్పడాలంటూ రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
Girl Kidnaped: నిన్న కనిపించకుండాపోయిన ఆరేళ్ల చిన్నారి.. తీవ్ర గాయాలతో ప్రత్యక్షం..!