Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajrang Dal: గో రక్ష కార్యకర్తలపై దాడికి పాల్పడాలంటూ రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

Bajrang Dal: గో రక్ష కార్యకర్తల పై దాడికి పాల్పడలంటూ రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన కలీమ్ అనే వ్యక్తిపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గోవులతో వెళ్తున్న వాహనాలను..

Bajrang Dal: గో రక్ష కార్యకర్తలపై దాడికి పాల్పడాలంటూ రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 05, 2021 | 12:39 PM

Bajrang Dal: గో రక్ష కార్యకర్తల పై దాడికి పాల్పడలంటూ రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన కలీమ్ అనే వ్యక్తిపై ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గోవులతో వెళ్తున్న వాహనాలను అడ్డుకుంటే దాడి చేయాలని సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసిన కలీమ్‌పై భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కలీమ్ పై ఐపీసీ153-a, 504,115 కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు మాట్లాడుతూ.. ఈ మధ్యన గోవులకు రక్షణ లేకుండా పోతోందని, గోవులపై, గో రక్ష కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని, అలాంటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

మరో వైపు తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్న గో అక్రమ రవాణాను అడ్డుకుని తీరుతామని విశ్వ హిందూ పరిషత్ చెబుతోంది. రాష్ట్రంలో గోహత్య నిరోధక చట్టాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. గోవుల అక్రమ రవాణాదారులకు, గోహంతకులకు కొమ్ముకాస్తున్న వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు కోరుతున్నారు. అలాగే గోరక్షకులపై వేధింపులు మానుకోవాలని, లేకపోతే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. ఇక గోవులను చంపుతున్న వారిని వదిలేసి గోరక్షకులపై కేసులు నమోదు అవుతున్నారని, బక్రీద్ వస్తున్న సందర్భంగా అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గోవుల తరలింపుపై నగరంలో, రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు.

ఇవీ కూడా చదవండి

Ts High Court: తెలంగాణ డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌.. జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లు తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ వివరాలు చెప్పవద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ..!