నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. వెలుగులోకి సంచలనాలు.. ఒక్కో పేపర్‌ను ఎంతకమ్మారంటే?
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా నాందేడ్‌లో అశ్విని కదం ఇంట్లో సోదాలు నిర్వహించింది. దాదాపు 8 గంటల పాటు సోదాలు జరిగిపిన సీబీఐ కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం టెలిగ్రామ్ ద్వారా జరిగినట్టు సీబీఐ గుర్తించింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో ఇన్వెస్టిగేషన్ యమా స్పీడుగా సాగుతోంది. లీక్ వెనకున్న మేథావులను వెతికి పట్టుకునే పనిలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సుమారు 9 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ.. తాజాగా నాందేడ్‌లోని అశ్విని కదం అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించింది. సుమారు 8 గంటల పాటు చేపట్టిన ఈ సోదాల్లో సీబీఐ కీలక సమాచారం రాబట్టింది. ఈ నీట్ పేపర్ లీక్ వ్యవహారం మొత్తం టెలిగ్రామ్ ద్వారా జరిగినట్టు గుర్తించింది.
దీంతో డిజిటల్ సాక్ష్యాల కోసం సదురు వ్యక్తులకు సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల స్వాధీనం చేసుకుంది సీబీఐ. అయితే వీరు నీట్ పేపర్ ఒక్కొక్కరికి రూ. 5 లక్షలకు విక్రయించినట్టు దర్యాప్తులో బయటపడింది. దీంతో లీకైన పేపర్ కొన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్నా నాశిక్‌కు చెందిన శుభమ్ ఖైర్నార్ బ్యాంక్ ఖాతాల అధికారులు పరిశీలించగా భారీగా జరిగిన ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.ఇక నిందితులకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పట్టుకునేందుకు సీబీఐ వేట సాగిస్తోంది.
ఇక దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న NEET-UG 2026 పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాదం కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 3న జరిగిన పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. నీట్ రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న ఈ పరీక్షను దేశవ్యాప్తంగా తిరిగి నిర్వహించనున్నట్టు పేర్కొంది. అయితే పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా కొంతమంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
