స్లిమ్‌గా మారాలంటే నల్ల మిరియాలు తప్పనిసరి! ఎందుకంటే?
17 May 2026
Jyothi Gadda
చాలా మంది బరువు తగ్గడం కోసం రకరకాల డైట్లు, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే, మన వంటింట్లో లభించే నల్ల మిరియాలు బరువు తగ్గించే ప్రక్రియను మరింత సులభం చేస్తాయి.
మిరియాల ఘాటుకు కారణం అందులో ఉండే పైపరీన్ అనే రసాయన సమ్మేళనమే. పరిశోధనల ప్రకారం, పైపరీన్ శరీరంలో థర్మోజెనిసిస్ ప్రక్రియను ప్రేరేపిస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచి, ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. అంతేకాదు,శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడే ప్రక్రియను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మనం తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవడానికి తోడ్పడుతుంది.
జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉన్నప్పుడు శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవు, తద్వారా బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
మిరియాల నీరు: రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా నల్ల మిరియాల పొడి, కొద్దిగా తేనె కలిపి పరగడుపున తాగాలి.
హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ: మీరు క్రమం తప్పకుండా తాగే గ్రీన్ టీ లేదా డికాషన్‌లో చిటికెడు మిరియాల పొడి వేసుకుని తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.
సలాడ్స్ సూప్స్: మీరు తినే వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ లేదా వేడివేడి సూప్‌లపై మిరియాల పొడిని చల్లుకుని తీసుకోవచ్చు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, వీటిని అతిగా తీసుకోకూడదు. రోజుకు అర చెంచా కంటే తక్కువ మోతాదులో వాడుకుంటూ, క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటే సహజంగానే బరువు నియంత్రణలోకి వస్తుంది.