AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price: సిల్వర్ ప్రియులకు షాక్.. వెండి ధర భారీగా పెరగనుందా..?

Silver Price: దిగుమతి ప్రక్రియ సంక్లిష్టంగా మారడం వల్ల దేశీయ మార్కెట్లోకి వెండి రాక తగ్గుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భౌతిక వెండి (Physical Silver) సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్ కంటే భారతీయ మార్కెట్లలో (MCX) వెండి ధరలు చాలా వేగంగా దూసుకుపోతాయి..

Silver Price: సిల్వర్ ప్రియులకు షాక్.. వెండి ధర భారీగా పెరగనుందా..?
Silver Price
Subhash Goud
|

Updated on: May 18, 2026 | 7:27 AM

Share

Silver Price: భారతదేశంలో బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే విలువైన లోహం వెండి. అయితే, రాబోయే రోజుల్లో మీరు వెండి ఆభరణాలు, నాణేలు లేదా పాత్రలు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. విదేశాల నుండి వెండి దిగుమతులను (Imports) నియంత్రించేందుకు ప్రభుత్వం నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. వెండిని ‘ఫ్రీ’ జాబితా నుండి తొలగించి, ‘రిస్ట్రిక్టెడ్’ (పరిమిత/నియంత్రిత) జాబితాలోకి చేర్చింది. అంటే, ఇకపై విదేశాల నుండి వెండిని దిగుమతి చేసుకోవాలంటే వ్యాపారులు ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ నిర్ణయం వల్ల మార్కెట్‌లో వెండి కొరత ఏర్పడి, ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది?

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు (ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం) ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. దీని ప్రభావం భారతదేశ విదేశీ మారక నిల్వలపై (Foreign Exchange Reserves) పడుతోంది. మనం విదేశాల నుండి ఏ వస్తువు కొన్నా, దానికి డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దేశం నుండి డాలర్లు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

ఇది కూడా చదవండి: Alcohol Prices: పక్క రాష్ట్రం కీలక నిర్ణయం.. మారిన లిక్కర్ ధరలు.. చౌక మద్యం ఇక కాస్ట్లీ.. ప్రీమియం బ్రాండ్లు మాత్రం తగ్గింపు..!

ఇవి కూడా చదవండి

దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికే ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఇదే క్రమంలో కొంతకాలం క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దేశప్రజలు ఏడాది పాటు బంగారం కొనవద్దని అభ్యర్థించారు. అంతకుముందు ప్రభుత్వం బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని (Customs Duty) సైతం 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

కొత్త ఆంక్షల పరిధిలోకి వచ్చేవి ఇవే:

కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై 99.9 శాతం స్వచ్ఛత కలిగిన సిల్వర్ బార్లను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. అలాగే, సెమీ-మాన్యుఫ్యాక్చర్డ్ వెండి, పౌడర్ రూపంలో ఉండే వెండి దిగుమతులకు కూడా అనుమతులు తప్పనిసరి చేశారు. భారత్‌లో వెండి దేశీయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉండటం వల్ల, మన అవసరాల కోసం అత్యధిక భాగం విదేశాలపైనే ఆధారపడుతున్నాం. డాలర్ల కొరత, పెరుగుతున్న వాణిజ్య లోటు (Trade Deficit) వంటి ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇప్పుడు వెండి కేవలం ఒక సాధారణ కమోడిటీ మాత్రమే కాదు, విదేశీ మారక నిల్వలను ప్రభావితం చేసే అత్యంత సున్నితమైన ఆస్తిగా మారిపోయింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

సరఫరా తగ్గితే ఆకాశాన్నంటనున్న ధరలు:

దిగుమతి ప్రక్రియ సంక్లిష్టంగా మారడం వల్ల దేశీయ మార్కెట్లోకి వెండి రాక తగ్గుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. భౌతిక వెండి (Physical Silver) సరఫరా తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్ కంటే భారతీయ మార్కెట్లలో (MCX) వెండి ధరలు చాలా వేగంగా దూసుకుపోతాయి. వెండిని కేవలం పట్టీలు, ఆభరణాల తయారీలోనే కాకుండా.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, పలు తయారీ పరిశ్రమలలో (Manufacturing Industries) భారీగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో కొరత వస్తుందనే భయంతో వ్యాపారులు ఇప్పుడే వెండిని భారీగా స్టాక్ చేయడం ప్రారంభించవచ్చు. దీనివల్ల డిమాండ్ అకస్మాత్తుగా పెరిగి ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగే ప్రమాదం ఉంది. చివరికి ఈ భారం సామాన్య వినియోగదారుడిపైనే పడనుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో జనరల్ బోగీలు ఎప్పుడూ ముందు, వెనుకే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us