AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education in India: 1.2 లక్షల పాఠశాలల్లో సింగిల్ టీచరే.. వేల సంఖ్యలో ఖాళీలు.. విస్తుగొలుపుతున్న వాస్తవాలు..

నేటి బాలలే రేపటి పౌరులు. పాఠశాలలు విద్యార్థుల అభివృద్ధికి మొదటి మెట్టు. వారికి విద్యను అందించాల్సిన అవసరంపై ప్రభుత్వాలపై ఎంతో ఉంది. పాఠశాలలు ఏర్పాటు చేయడం, టీచర్లు, సిబ్బందిని నియమించడం..

Education in India: 1.2 లక్షల పాఠశాలల్లో సింగిల్ టీచరే.. వేల సంఖ్యలో ఖాళీలు.. విస్తుగొలుపుతున్న వాస్తవాలు..
Teacher Posts
Ganesh Mudavath
|

Updated on: Feb 21, 2023 | 1:02 PM

Share

నేటి బాలలే రేపటి పౌరులు. పాఠశాలలు విద్యార్థుల అభివృద్ధికి మొదటి మెట్టు. వారికి విద్యను అందించాల్సిన అవసరంపై ప్రభుత్వాలపై ఎంతో ఉంది. పాఠశాలలు ఏర్పాటు చేయడం, టీచర్లు, సిబ్బందిని నియమించడం, సౌకర్యాలు, వసతులు కల్పించడం చాలా ముఖ్యం. అయితే.. మన దేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉందనే విషయంపై చేసిన సర్వేలో మింగుడుపడని వాస్తవాలు వెల్లడయ్యాయి. భారతదేశంలోని దాదాపు 1.2 లక్షల పాఠశాలల్లో కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని ఓ నివేదికలో వెల్లడైంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో 58,000 పైగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో వివరించారు. 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సగం కంటే తక్కువ పాఠశాలలు ఇంటర్నెట్ సదుపాయాన్ని కలిగి ఉన్నందున డిజిటల్ ప్రోగ్రామ్‌ల అమలు కష్టతరమవుతోంది. కేంద్రీయ విద్యాలయాల్లో 12,099 టీచింగ్ పోస్టులు, 1,312 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 3,271 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో బోధనేతర పోస్టుల సంఖ్య 1,756 ఖాళీగా ఉన్నాయి.

2023–24 కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కేంద్రం రూ.1.13 లక్షల కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యపై అంచనా వ్యయం 2022–23 నుంచి దాదాపు 8.3 శాతం పెరిగింది. అయినప్పటికీ.. భారతదేశ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇంకా గణనీయమైన అవకాశం ఉందని పార్లమెంటులో ప్రశ్నలకు ఇటీవలి ప్రతిస్పందనలు వస్తున్నాయి. బోధన అర్హత కలిగిన సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది . విద్యను డిజిటలైజ్ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. భారతదేశంలోని ప్రతి నాలుగు పాఠశాలల్లో కేవలం ఒక దాంట్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉంది.

విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, కేంద్ర ఉన్నత విద్యా సంస్థలలో 58,000 పైగా బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్ ఈ సమాచారాన్ని పంచుకున్నారు. విద్యా ఫలితాలను ప్రోత్సహించడానికి, నష్టాలను భర్తీ చేయడానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్‌లో నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆవశ్యకతను వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..