Operation Dost: ‘ప్రపంచానికే అండగా భారత్’.. వీడియో చూస్తే రోమాలు నిక్కబొడవాల్సిందే..
భారీ భూకంపం టర్కీ, సిరియా దేశాలను వణికించింది. ఆ రెండు దేశాలను అతలాకుతలం చేశాయి. భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్థి నష్టం కలిగింది. ఇప్పటివరకు 46వేలకు పైగా ప్రజలు మరణించగా..
భారీ భూకంపం టర్కీ, సిరియా దేశాలను వణికించింది. ఆ రెండు దేశాలను అతలాకుతలం చేశాయి. భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్థి నష్టం కలిగింది. ఇప్పటివరకు 46వేలకు పైగా ప్రజలు మరణించగా.. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. ఆ శిథిలాల తొలగింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే.. టర్కీ, సిరియా ప్రజలకు సహాయం అందించడానికి భారత్ ఆపరేషన్ దోస్త్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మన దేశ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, వైద్య సిబ్బంది, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. బాధితులకు అవసరమైన ఆహారం, అత్యవసర వైద్య పరికరాలు, పలు వస్తువులను అందించింది. 99 మందితో కూడిన వైద్య బృందం హటేలోని ఇస్కెండరున్ లో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించి.. సేవలు అందించింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు శిథిలాల తొలగింపులో సహాయక చర్యలు చేపట్టారు.
అయితే, ఆపరేషన్ దోస్త్ కింద మోహరించిన భారత ఆర్మీ వైద్య బృందం సహాయక చర్యలు ముగియడంతో టర్కీ నుంచి తిరిగి వచ్చింది. భారత్ నుంచి వెళ్లి వచ్చిన చివరి బృందం ఇదే కాగా, టర్కీ, సిరియా దేశాలలో సేవలందించి తిరిగి స్వదేశానికి వచ్చిన భారత సహాయక బృందాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ భారత్ నిర్వహించిన సహాయక చర్యలు, చేపట్టిన కార్యక్రమాలు, వారికి ఎదురైన అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ తన అనుభవాన్ని పంచుకున్నారు..
సహాయక చర్యల్లో భాగంగా నేను తిరుగుతున్నప్పుడు ఓ పేషెంట్ బంధువు నన్ను గమనించి, నా రెండు చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. మీరు నా తండ్రి సమానులు అంటూ.. ‘నేను ఈ దేశ యంగ్ జనరేషన్‌కి చెందిన వాడిని. మీరు మా దేశానికి చేసిన సేవలు, సహాయం మేమే కాదు.. తదుపరి జనరేషన్ కూడా గుర్తుంచుకుంటుంది. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుంటాయి’ అని చెప్పాడంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు కమాండర్.
ఎన్డీఆర్ఎఫ్ మహిళా సిబ్బంది తన అనుభవాన్ని పంచుకున్నారు..
‘మాకు మొదటి ప్రాధాన్యతగా అల్లా ఉంటారు, ఇక నుంచి రెండో స్థానంలో మీరు ఉంటారు.’ అని ఆ ఆ దేశానికి చెందిన పౌరురాలు తనతో పేర్కొన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు.
డాగ్ స్వ్కార్డ్ కీలక పాత్ర..
టర్కీ, సిరియా సహాయక చర్యల్లో డాగ్ స్క్వార్డ్స్ కూడా అద్భుతంగా పని చేశాయని సహాయక బృందం తెలిపింది. జూలీ అనే శునకం.. శిథిలాల కింద చిక్కుకున్న సజీవ వ్యక్తిని గుర్తించింది. 80 గంటలుగా అతను ఆ శిథిలాల కింద నలిగిపోయాడు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని కాపాడాము అని డాగ్ స్వ్కార్డ్ సిబ్బంది తెలిపారు.
వైద్య బృందం..
భూకంప బాధితులకు వైద్య సదుపాయం అందించి, వారి ఆరోగ్య మెరుగుపడే వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నామని వైద్య బృందం తెలిపింది. బాధితులంతా తమను దేవుళ్లలా చూశారని గుర్తు చేశారు.
వాయిసేన కమాండర్..
‘భారత్ అంటేనే ప్రపంచ దేశాల్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఒక రకమైన భరోసా ఉంటుంది. టర్కీ విషయంలో ఇది నిరూపితమైంది. భారత సిబ్బంది పట్ల టర్కీ, సిరియా పౌరులు ఎంతో కృతజ్ఞత చూపారు. ఏ దేశానికి కష్టమొచ్చినా భారత్ అండగా ఉంటుందనే విశ్వాసం ప్రపంచానికి వచ్చింది.’ అని వాయుసేన కమాండర్ చెప్పుకొచ్చారు.
టర్కీ, సిరియా భూకంప బాధితులకు మన దేశ సహాయక బృందం చేసేన సేవలు, వారి అనుభవాలను తెలుసుకోవడానికి కింద వీడియోను చూడొచ్చు.
I will always remember this interaction with those who took part in ‘Operation Dost.’ pic.twitter.com/RYGDuEn6wW
— Narendra Modi (@narendramodi) February 21, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..