AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కోవిద్ పరిస్థితిపై చర్చను అడ్డుకున్న ఎన్డీయే ఎంపీలు…పీఏసీ కమిటీ చైర్మన్ అధిర్ రంజన్ చౌదరి ఆగ్రహం..

దేశంలో కోవిద్ పరిస్థితిపై చర్చించేందుకు బుధవారం సమావేశమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) దీనిపై పెద్దగా చర్చ లేకుండానే చప్పగా ముగిసింది.

దేశంలో కోవిద్ పరిస్థితిపై చర్చను అడ్డుకున్న ఎన్డీయే ఎంపీలు...పీఏసీ కమిటీ చైర్మన్ అధిర్ రంజన్ చౌదరి ఆగ్రహం..
Adhir Ranjan Chowdhury
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 16, 2021 | 8:10 PM

Share

దేశంలో కోవిద్ పరిస్థితిపై చర్చించేందుకు బుధవారం సమావేశమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) దీనిపై పెద్దగా చర్చ లేకుండానే చప్పగా ముగిసింది. ముఖ్య సమస్యపై సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఒక దశలో కాంగ్రెస్ నేత.. ఈ కమిటీ చైర్మన్ అధిర్ రంజన్ చౌదరి.. తన పదవి నుంచి దిగిపోతానని హెచ్చరించారు. మొదట కరోనా వైరస్, కోవిద్-19 పరిస్థితిపై మాట్లాడడం మొదలు పెట్టగానే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ఎంపీలు జగదాంబికా పాల్, లాలన్ సింగ్ లేచి ఆయనకు అడ్డు తగులుతూ..ఇప్పుడు దీనిపై చర్చించాల్సిన అవసరం లేదన్నారు.. హోమ్ వ్యవహారాలపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇదివరకే ఈ అంశాన్ని చేబట్టిందని, ఇప్పుడు మళ్ళీ దీనిపై చర్చలు, మంతనాలు అనవసరమని అన్నారు.

ముఖ్య సమస్యలపై ఎప్పుడు పీఏసీ సమావేశాన్ని నిర్వహించినా అధికార ఎన్డీయే ఎంపీలు అడ్డు తగలడం దాదాపు పరిపాటి అయింది. జగదాంబికా పాల్, లాలన్ సింగ్ ఇద్దరూ ఇలా వ్యవహరిస్తే తను ఈ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని అధిర్ రంజన్ చౌదరి ఆగ్రహంతో అన్నారు. థర్డ్ కోవిద్ వేవ్ పై కూడా మనం చర్చించాల్సి ఉందని, కానీ నేను మాట్లాడడం మొదలు పెట్టగానే మీరు అడ్డుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. అయితే డీఎంకే, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని జేడీ-యూ సభ్యులు కనీసం ఎన్డీయే ఎంపీలను వారించలేదు సరికదా.. మౌనం వహించారు. అలాగే కోవిద్ పై సమగ్ర సమీక్ష జరగాలన్న చౌదరి ప్రతిపాదనపై కూడా వారు తమ స్పందన తెలియజేయలేదు.

ఇక ఈ మీటింగ్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ కూడా ప్రేక్షక పాత్ర వహించారు. ఆ మధ్య వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు అధిర్ రంజన్ చౌదరి పార్టీ నాయకత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆయనకు గుర్తున్నట్టు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Pullela Gopichand: ఇప్పుడు రోనాల్డో చేసిన పని ఇరవై ఏళ్ల క్రితమే మన పుల్లెల గోపీచంద్ చేశాడు..ఏమిటో తెలుసా?

LPG Subsidy: మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఇలా ఫిర్యాదు చేయండి.! వివరాలివే..