కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాల సమరశంఖం.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలకు మద్దతు
విపక్ష సభ్యులతో కలిసి జంతర్‌మంతర్‌కు చేరుకున్న రాహుల్.. వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతు ప్రకటించారు.
Opposition Leaders Protest at Jantar Mantar: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. కేంద్రానికి వ్యతిరేకంగా సమరానికి సిద్ధమయ్యారు. ప్రతిపక్ష ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఎన్‌సీపీ, శివసేన, వామపక్షాలు సహా 14 పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఆ తర్వాత విపక్ష సభ్యులతో కలిసి జంతర్‌మంతర్‌కు చేరుకున్న రాహుల్.. వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతు ప్రకటించారు. సేవ్ ఫార్మర్స్..సేవ్ ఇండియా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, ద్రవ్యోల్బణం అంశాలపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబట్టిన విపక్షాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది. దీంతో వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధ్యక్షతన విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి.
కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, అంబికాసోనీ, గౌరవ్ గొగోయ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, డీఎంకే నేత టీ శివ తదితరులు పార్లమెంటు ఆవరణలో సమావేశమై.. కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేవరకు ఉమ్మడి పోరాటం ఆపకూడదని డిసైడయ్యారు. అనంతరం విపక్ష నేతలంతా బస్సులో జంతర్‌మంతర్‌కు వెళ్లారు.
అక్కడ వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో విపక్ష పార్టీల నేతలు కలిసిపోయారు. రైతులకు మద్దతుగా వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, పెగాసస్‌కు వ్యతిరేకంగా విపక్ష నేతలు నినాదాలు చేశారు.
#WATCH | Congress leader Rahul Gandhi and other Opposition leaders reach Jantar Mantar, Delhi to extend support to farmers in their protest against farm laws by raising slogans with a placard ‘Save Farmers, Save India’ pic.twitter.com/VMyi4ShlYo
— ANI (@ANI) August 6, 2021
Read Also… Surakshabandhan: సురక్ష బంధన్‌కు విశేష స్పందన.. టీవీ 9 ఆధ్వర్యంలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత వ్యాక్సిన్