Johnson Vaccine: సింగిల్ డోస్ వచ్చేస్తోంది.. అత్యవసర వినియోగానికి జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు
Johnson Covid vaccine: దేశంలో కరోనా కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, స్పూత్నిక్ వ్యాక్సిన్లను
Johnson Covid vaccine: దేశంలో కరోనా కట్టడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, స్పూత్నిక్ వ్యాక్సిన్లను 18 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేస్తున్నారు. అయితే.. తాజాగా కరోనావైరస్ కట్టడికి సింగిల్ డోసు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోసు కోవిడ్ వ్యాక్సిన్ (జాన్సన్).. అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం దరఖాస్తు చేసుకుంది. ఈ సంస్థ జాన్సన్ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. అయితే.. గతంలో ఈ సంస్థ భారత్‌లో ట్రయల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకొని దానిని ఉపసంహరించుకుంది. పలు దేశాల్లో ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు.
కాగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు దేశాలు అనుమతించిన వ్యాక్సిన్లను.. ట్రయల్స్ నిర్వహణ అవసరం లేకుండానే నేరుగా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. గురువారమే దరఖాస్తు చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
భారత ప్రజలకు తమ సింగిల్ డోసు వ్యాక్సిన్ తొడ్పాటునందిస్తుందని.. ఇది చాలా ముఖ్యమైన అడుగు అంటూ ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థతో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ భాగస్వామ్యంగా ఉంది.
Also Read: