AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Data Protection Bill: డేటా ప్రొటక్షన్ బిల్లుపై మంత్రి వైష్ణవ్ అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన నాస్కామ్..

ప్రజల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించేందుకు కేంద్రం పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును తీసుకువచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది.

Data Protection Bill: డేటా ప్రొటక్షన్ బిల్లుపై మంత్రి వైష్ణవ్ అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన నాస్కామ్..
Minister Ashwini Vaishnaw
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2023 | 4:44 PM

Share

డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనుమతి ఇచ్చిందంటూ వస్తున్న వార్తలపై నాస్కామ్ స్పందించింది. ఆ బిల్లును తీసుకురావాలని మాత్రమే మంత్రిని కోరామని, దానికి మంత్రి స్పందించారని వివరణ ఇచ్చింది. ఈ మేరకు ట్వీట్ చేసిన నాస్కామ్.. ‘డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును వీలైనంత త్వరగా తీసుకురావాలని కేంద్ర మంత్రి వైష్ణవ్‌ను టెక్ ఇండస్ట్రీ అభ్యర్థించడం జరిగింది. ఈ బిల్లును ఎంత త్వరగా తీసుకువస్తే అంత మంచి జరుగుతుంది. ఈ బిల్లు ద్వారా ఇండియా ప్రపంచంలోనే విశ్వసనీయమైన దేశంగా మారుతుంది’ అని పేర్కొంది.

‘తమ అభ్యర్థనకు మంత్రి వైష్ణవ్ స్పందించారు. ఈ బిల్లు అత్యంత ప్రాధాన్యత కలిగిన బిల్లు, పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు అంతా సిద్ధం చేశాం. దానికంటే ముందుు పార్లమెంటరీ కమిటీతో ఈ బిల్లుపై సమీక్షలు, చర్చలు జరుపుతాం.’ అని మంత్రి తెలిపారని నాస్కామ్ పేర్కొంది. అయితే, ఈ బిల్లును కమిటీ అప్రూవ్ చేసినట్లు సదస్సులో ఎక్కడా మంత్రి చెప్పలేదని నాస్కామ్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

క్లారిటీ ఇచ్చిన నాస్కామ్..

కాగా, ప్రజల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పించేందుకు కేంద్రం పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును తీసుకువచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు సిద్ధం చేసిన కేంద్రం.. త్వరలోనే పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అయితే, తాజాగా నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో వర్చువల్‌గా ప్రసంగంచిన కేంద్రమంత్రి వైష్ణవ్.. ఈ ముసాయిదా బిల్లుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని చెప్పారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన నాస్కామ్.. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..