AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

black fungus infection: బ్లాక్ ఫంగ‌స్‌ చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు అయ్యింది.. అయినా కూడా

కరోనా వైరస్‌ను జ‌యించిన కొంద‌రిపై బ్లాక్​ఫంగస్ దాడి చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా...

black fungus infection:  బ్లాక్ ఫంగ‌స్‌ చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు అయ్యింది.. అయినా కూడా
1.5 Crore For Treatment Of Black Fungus
Ram Naramaneni
|

Updated on: Jun 12, 2021 | 3:12 PM

Share

కరోనా వైరస్‌ను జ‌యించిన కొంద‌రిపై బ్లాక్​ఫంగస్ దాడి చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా పూర్తి స్థాయిలో న‌యం అవుతుంద‌న్న గ్యారంటీ ల‌భించ‌డం లేదు. అలాంటి ఘటన తాజాగా మహారాష్ట్రలో జరిగింది. నాగ్​పుర్​లో గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిగా పనిచేస్తున్న నవీన్​ పాల్​కు గత ఏడాది సెప్టెంబర్​లో బ్లాక్​ఫంగస్ సోకింది. ఈ వ్యాధి​ నుంచి కోలుకోవడానికి రూ.1.48 కోట్లు ఖర్చు అయ్యాయి.

క‌రోనా నుంచి కోలుకున్న కొద్ది రోజులకు పాల్​కు కళ్ల సమస్య మొదలైంది. చికిత్స కోసం నాగ్​పుర్​, హైదరాబాద్​లోని డాక్ట‌ర్ల‌ను సంప్రదించాడు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పాల్​కు వచ్చిన సమస్యను డాక్ట‌ర్లు గుర్తించలేకపోయారు. దీంతో నవంబరులో పాల్​ ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చేరాడు. బ్లాక్​ఫంగస్​ సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు. ముంబైలోని హిందూజా ఆస్పత్రి డాక్ట‌ర్లు అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశారు. మెడిసిన్, ఇన్​జెక్షన్ల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవడం వల్ల నవీన్​ పాల్​.. నాగ్​పుర్​లోనే చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబరులో నాగ్​పుర్​ చేరుకున్న పాల్​.. అతని​ భార్య రైల్వే ఉద్యోగి కావడం వల్ల స్థానిక రైల్వే ఆస్పత్రిలో చేరాడు. అక్కడి డాక్ట‌ర్లు పాల్​ ఎడమ కన్ను సహా ఇన్ఫెక్షన్​కు గురైన నోటిలో కొంత భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం కళ్ల సమస్య కొంత తగ్గినట్లు పాల్​ తెలిపాడు.

Also Read: కదిలే రైలులో టాయిలెట్ ముందు వివాహం.. చాలా పెద్ద స్టోరీనే ఉంది

కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి.. పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై క్లారిటీ

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!