Meghalaya – Nagaland Election: మేఘాలయ, నాగాలాండ్‌లో ప్రారంభమైన పోలింగ్.. బరిలో 552 మంది అభ్యర్థులు..

ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో 552 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 34 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

Meghalaya - Nagaland Election: మేఘాలయ, నాగాలాండ్‌లో ప్రారంభమైన పోలింగ్.. బరిలో 552 మంది అభ్యర్థులు..
Meghalaya - Nagaland Election
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 27, 2023 | 7:29 AM

ఈశాన్య భారత్‌లోని మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. రెండు రాష్ట్రాల్లో 552 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 34 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్నాయి. అయితే నాగాలాండ్‌లో ఒక స్థానం (అకులుటో) ఎన్నిక ఏకగ్రీవం కాగా, మేఘాలయలో ఓ అభ్యర్థి (సోహియాంగ్‌ స్థానంలో) మరణించారు. దీని కారణంగా రెండు రాష్ట్రాల్లో 59 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

నాగాలాండ్‌లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,291 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అధికార నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ), బీజేపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. కాంగ్రెస్‌, ఎన్‌పీపీ, ఎన్సీపీ, జేడీయూ కూడా గట్టి పోటీఇస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మేఘాలయలో 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 21.6 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 3,419 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అధికార నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ పోటీలో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..