AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంట్రా ఇది.. ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్.. ముంబై ఆత్మాహుతి దాడుల బెదిరింపు వ్యవహారంలో ట్విస్ట్‌..

ముంబైలో ఆత్మాహుతి దాడులతో కోటి మందిని చంపేస్తామని పోలీసులకు వచ్చిన హెచ్చరిక వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో అశ్వినీకుమార్ అనే వ్యక్తి ఈ సందేశాన్ని పంపించినట్టు గుర్తించారు. అశ్వినీకుమార్‌ను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసి తరలించారు.

ఏంట్రా ఇది.. ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్.. ముంబై ఆత్మాహుతి దాడుల బెదిరింపు వ్యవహారంలో ట్విస్ట్‌..
Mumbai Police Nab Noida Man
Shaik Madar Saheb
|

Updated on: Sep 06, 2025 | 8:45 PM

Share

ముంబైలో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని ట్రాఫిక్‌ పోలీసులకు వచ్చిన వాట్సాప్‌ కాల్‌ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. పోలీసులకు బెదిరింపు మెసేజ్‌ను పంపించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు బీహార్‌లోని పాటలీపుత్రకు చెందిన అశ్వినీ కుమార్‌గా గుర్తించారు. అశ్వినీకుమార్‌ను నోయిడాలో అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఫిరోజ్‌ అనే వ్యక్తి తనపై 2023లో కేసు పెట్టాడని, దీంతో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో కోపంతో రగిలిపోయిన అతడు.. దీనికి ప్రతీకారంగానే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పాడు. నిందితుడి నుంచి ఏడు మొబైల్‌ ఫోన్స్‌, మూడు సిమ్‌ కార్డ్స్‌, ఆరు మెమరీ కార్డ్స్‌ తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముంబై నగరమంతా మానవ బాంబులను మోహరించామని, 400 కిలోల ఆర్డీఎక్స్‌తో కోటి మందిని చంపేస్తారంటూ వచ్చిన వాట్సాప్‌ సందేశం ముంబై పోలీసులను పరుగులు పెట్టించింది. . వినాయక నిమజ్జనం వేళ ఈ బెదిరింపు మెయిల్‌ రావడంతో ముంబై పోలీసులు హై అలర్ట్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపులపై దర్యాప్తు చేపట్టిన అధికారులు అశ్వినీకుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

ముంబై ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికార వాట్సాప్‌ నంబర్‌కు శుక్రవారం ఒక బాంబు బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. తాము పాకిస్థాన్‌కు చెందిన లష్కరే జీహాదీ గ్రూప్‌నకు చెందిన వాళ్లమని , 14 మంది ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని, అనంత చతుర్దశి సందర్భంగా నగరంలోని 34 చోట్ల 34 మానవ బాంబులను మోహరించామని అందులో తెలిపారు. మానవ బాంబులతో కూడిన పలు వాహనాలను ముంబై నగరమంతా మోహరించామని, వారి వద్ద ఉన్న 400 కేజీల ఆర్డీఎక్స్‌తో కోటి మంది చనిపోతారని మెసేజ్‌లో బెదిరించారు.

వెంటనే దీనిపై అధికారులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్‌ బ్రాంచ్‌ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌, ఇతర దర్యాప్తు సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..