Covid-19 Positive: ఒకే వ్యక్తికి 13 నెలల్లో మూడు సార్లు కరోనా పాజిటివ్‌.. కోవిడ్‌ టీకా తీసుకున్నాక కూడా..!

Subhash Goud

Subhash Goud | Edited By: Anil kumar poka

Updated on: Jul 28, 2021 | 8:38 AM

Covid-19 Positive: గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల కారణంగా..

Covid-19 Positive: ఒకే వ్యక్తికి 13 నెలల్లో మూడు సార్లు కరోనా పాజిటివ్‌.. కోవిడ్‌ టీకా తీసుకున్నాక కూడా..!
Covid-19

Follow us on

Covid-19 Positive: గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కొత్త వేరియంట్ల రూపంలో వ్యాప్తి చెందుతుండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో రీ ఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా ఓ 26 ఏళ్ల వైద్యురాలు 13 నెలల వ్యవధిలో మూడు సార్లు కోవిడ్‌ బారిన పడ్డారు. ఆమెతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. డాక్టర్‌ సృష్టి హళ్లారి ముంబాయిలోని వీర్‌ సావర్కర్‌ ఆస్పత్రిలో కరోనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గత సంవత్సరం జూన్‌ 17న మొదటిసారి వైరస్‌ బారిన పడ్డారు. ఆ సమయంలో ఆమెలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఆమెతో సహా కుటుంబం అంతా రెండు డోసుల టీకా వేయించుకున్నారు. సరిగ్గా నెలరోజులకు మే 29న ఈ వైద్యురాలు రెండోసారి వైరస్ సోకింది. అప్పుడు కూడా ఆమె ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తూ క్రమ క్రమంగా కోలుకున్నారు. ఇక మూడోసారి జూలై 11న ఆమెకు మళ్లీ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈసారి ఆమెతో పాటు కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని సృష్టి వెల్లడించారు.

ఈసారి వైరస్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది:

ఈ సారి వచ్చిన వైరస్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని బాధితురాలు వెల్లడించారు. నాతో సహా కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. మాకు రెమ్‌డెసివిర్ వాడాల్సిన పరిస్థితి ఎదురైంది. మా అమ్మ, సోదరుడికి డయాబెటిస్‌ ఉంది. మా నాన్నకు బీపీ, కొలెస్ట్రాల్ సమస్య ఉంది. నా సోదరుడికి శ్వాసలో ఇబ్బంది తలెత్తడంతో రెండురోజుల పాటు ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది అని ఆమె తెలిపారు.

అయితే కోవిడ్‌ కొవిడ్ టీకా వేయించుకున్నా వైరస్ సోకుతుందని, అయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని మొదటి నుంచే వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు. టీకా రెండు డోసుల తర్వాత వైరస్ బారినపడినవారున్నారు. అయితే టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు ఈ టీకాలు సహకరిస్తాయి అని వాక్‌హార్డ్ ఆస్పత్రికి చెందిన వైద్యులు బెహ్రామ్ పార్దివాలా వెల్లడించారు. ఇటీవల ఐసీఎంఆర్ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైన విషయం తెలిసిందే.

ఇవీ కూడా చదవండి

Nutrition Food: పోషకాహార లోపంతో ఉన్నవారికి కరోనా తేలికగా వ్యాప్తిస్తుంది.. మరణకారకంగానూ మారుతుంది..పరిశోధనల్లో వెల్లడి!

Gandhi Hospital: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆగస్టు 3 నుంచి గాంధీలో అన్నిరకాల వైద్య సేవలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu