AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్థరాత్రి బురఖాలో అక్కడికి వచ్చిన అమ్మాయి.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే ఫ్యూజులౌట్

అతనో దొంగ. ఒకట్రెండు కాదూ.. పదేళ్లుగా చోరీల మీద చోరీలు చేస్తూనే ఉన్నాడు. బట్.. ఖాకీలకు మాత్రం చిక్కడం లేదు. దమ్ముంటే పట్టుకో పోలీస్ అంటూ .. రెండు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు. ఇక లాభం లేదనుకున్న ఖాకీలు సీన్‌లోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది? మోస్ట్ వాంటెండ్ దొంగోడు దొరికాడా?

అర్థరాత్రి బురఖాలో అక్కడికి వచ్చిన అమ్మాయి.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే ఫ్యూజులౌట్
Ranjit Kumar Singh in Burkha
Ram Naramaneni
|

Updated on: Jun 04, 2025 | 11:28 PM

Share

అమ్మాయిలా వేషధారణ.. నడకలో తేడా రాకుండా జాగ్రత్తలు.. పరిసరాలు స్కాన్.. యాజిటీజ్‌.. అమ్మాయిలానే నడుస్తాడు.  వేషంలోనూ.. నడకలోనూ ఎక్కడా తేడా రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు.  అటు ఇటు తిరగడం.. పరిసరాలను స్కాన్ చేయడం..

రెప్పపాటులో అక్కడ్నుంచి మాయం కావడం.. గత పదేళ్లుగా ఇదే తంతు. పట్టుకోండి చూద్దాం అంటూ ఖాకీలకు సవాల్‌ విసురుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు పాపం పండి.. పోలీసులకు చిక్కాడు.

మలాడ్‌, మలవాణి ప్రాంతాల్లో ఎన్నో దొంగతనాలు

చిక్కడు దొరకడు టైపులో తప్పించుకు తిరిగిన ఇతను రంజిత్ కుమార్ సింగ్ అలియాస్ ఉపేంద్ర అలియాస్ మున్నా. వయసు 44ఏళ్లు. బిహార్‌లోని బబువాగంజ్‌ ప్రాపర్‌. మలాడ్‌, మలవాణి ప్రాంతాల్లో ఎన్నో దొంగతనాలు చేశాడు. లోకల్ ఏరియాలో దొంగతనాలు ఎక్కువ కావడంతో కొన్నాళ్లు ముంబైకి మకాం మార్చాడు. అక్కడ కూడా ఖాకీలకు చిక్కకుండా చోరీలు చేశాడు. ఇతనికి స్పైడర్ మ్యాన్ దొంగ అనే పేరుంది. ఎందుకంటే.. ఇళ్లకు ఉండే పైపులు, గోడలు.. అతి సునాయాసంగా ఎక్కేస్తాడు.

Ranjit Kumar Singh

Ranjit Kumar Singh

సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ఉపేంద్ర

బురఖా ధరించి చోరీలు చేసేవాడు ఉపేంద్ర. చోరీలకు ముందే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఓ కన్నేసే వాడు. దొంగతనాలు చేశాక.. సీసీ కెమెరాలు ఉండే వైపునకు వెళ్లకుండా.. రైల్వే ట్రాక్ మార్గంలో నడుచుకుంటూ స్వస్థలానికి వెళ్లేవాడు. ఇదీ ఉపేంద్ర మోడస్ ఓపెరాండి. చోరీల మీద చోరీలు చేసి సవాల్‌ విసిరిన ఉపేంద్రను పట్టుకునేందుకు వేర్వేరు ప్రాంతాల్లో 150కి పైగా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను తిరగేశారు. అందులో దొరికిన ఆధారాలతో ఉపేంద్రను మలవాణి ఏరియాలో అరెస్ట్ చేశారు.

ఖరీదైన ప్లేస్‌లో ల్యాండ్‌లు కొన్నట్టు గుర్తింపు

ఉపేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును చూసి ఖాకీలు షాకయ్యారు. కోట్ల రూపాయల సొత్తు.. అంతకుమించి ఖరీదైన ప్లేస్‌లో ల్యాండ్‌లు కొన్నట్టు గుర్తించారు. 36 తులాల బంగారు, వెండి నగలు, 16లక్షల నగదు, మహిళల దుస్తులు, 57లక్షల విలువ చేసే ఆస్తులతో పాటు గోల్డ్‌ కరిగించే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా చోరీలనే వృత్తిగా మలచుకుని కోట్ల రూపాయలు సంపాదించాడు ఉపేంద్ర.

ఏ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టాడు? 

ఉపేంద్ర ఎక్కడెక్కడ చోరీలు చేశాడు..? ఏ స్థాయిలో ఆస్తులు కూడబెట్టాడు..? చోరీ చేసిన సొత్తుతో భూములు కొన్నాడా? అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి