Bomb threat call: ఫేమస్‌ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ హెచ్చరికలు..

డబ్బులు ఇవ్వకుంటే హోటల్‌లోని నాలుగు చోట్ల బాంబులు పెట్టేస్తానని బెదిరించారు. హోటల్‌లో బాంబులు అమ‌ర్చామ‌ని, డ‌బ్బులు ఇవ్వ‌కుంటే పేల్చేస్తామంటూ సోమ‌వారం బెదిరింపు కాల్ వ‌చ్చింది. అయితే హోట‌ల్‌లో

Bomb threat call: ఫేమస్‌ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ హెచ్చరికలు..
Lalit Star Hotel
Follow us
Jyothi Gadda

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 23, 2022 | 12:46 PM

Lalit star hotel: ముంబైలోని ఫైవ్ స్టార్ లలిత్ హోటల్‌కు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేపింది. హోటల్ యజమాని నుంచి రూ.5 కోట్ల ఇవ్వాలని డిమాండ్‌ చేశారు అగంతకులు. డబ్బులు ఇవ్వకుంటే హోటల్‌లోని నాలుగు చోట్ల బాంబులు పెట్టేస్తానని బెదిరించారు. హోటల్‌లో బాంబులు అమ‌ర్చామ‌ని, డ‌బ్బులు ఇవ్వ‌కుంటే పేల్చేస్తామంటూ సోమ‌వారం బెదిరింపు కాల్ వ‌చ్చింది. అయితే హోట‌ల్‌లో సెక్యూర్టీ చెకింగ్ జ‌రిగిన త‌ర్వాత ఆ బెదిరింపు కాల్ ఉత్త‌దే అని పోలీసులు తేల్చారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు బుక్ చేసి విచార‌ణ చేప‌ట్టారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మంగళవారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి హోటల్‌కు ఫోన్ చేసి హోటల్‌లో బాంబు ఉందని చెప్పాడు. దీంతో పాటు రూ.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే, హోటల్‌ను బాంబులు పెట్టి పేల్చివేస్తామని బెదిరించినట్టుగా హోటల్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు పోలీసులు.. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన లలిత్ హోటల్‌లో సోదాలు చేపట్టారు. మొత్తం వ్యవహారంపనై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి