AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: అర్థరాత్రి ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. ఇంట్లో టీవీ చూస్తున్న వారిపై తుపాకీతో కాల్పులు.. ఇద్దరు మృతి

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాల్పుల మోతతో దద్దరిల్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో చిగురుటాకులా వణికిపోయింది. జేజే కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు...

Delhi: అర్థరాత్రి ఉలిక్కిపడ్డ ఢిల్లీ.. ఇంట్లో టీవీ చూస్తున్న వారిపై తుపాకీతో కాల్పులు.. ఇద్దరు మృతి
Gun Firing
Ganesh Mudavath
|

Updated on: Aug 23, 2022 | 12:10 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాల్పుల మోతతో దద్దరిల్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో చిగురుటాకులా వణికిపోయింది. జేజే కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు జేజే కాలనీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో టీవీ చూస్తున్న ముగ్గురు వ్యక్తులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. మే నెలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్‌ నగర్‌లో (Subhash Nagar) దుండగులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. జనావాసాల్లో కాల్పులు జరపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 16న నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత పశ్చిమ ఢిల్లీలో కాల్పుల ఘటన కొన్ని వారాల తర్వాత తెరపైకి వచ్చింది. ఈ హింసాకాండలో పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు.. హీరోయిన్ కూడా..!
ఆ హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడు.. హీరోయిన్ కూడా..!
పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?
పెట్రోల్ పంప్ బిజినెస్ సీక్రెట్స్.. లీటర్ పెట్రోల్‌పై కమిషన్ ఎంత?
9 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 41 బంతుల్లో గార్డ్ కొడుకు బీభత్సం..!
9 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 41 బంతుల్లో గార్డ్ కొడుకు బీభత్సం..!
అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!
అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్‌!
బయట జ్యూస్ తాగే ముందు ఒక్కసారి ఇది చూడండి..!
బయట జ్యూస్ తాగే ముందు ఒక్కసారి ఇది చూడండి..!
రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక
రాఖీ పండగ మాత్రమే కాదు.. శ్రావణ పౌర్ణమి రోజున జరిగే ఈ గొప్ప వైదిక
అర్ధరాత్రి బస్సులో మహిళకు షాకింగ్ అనుభవం..
అర్ధరాత్రి బస్సులో మహిళకు షాకింగ్ అనుభవం..
టార్గెట్ ఫిక్స్ చేసుకుని బరిలోకి సై అంటోన్న ముగ్గురు తోపులు..
టార్గెట్ ఫిక్స్ చేసుకుని బరిలోకి సై అంటోన్న ముగ్గురు తోపులు..
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్..
కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్..
మీకు ఈ కార్డు ఉందా? చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!
మీకు ఈ కార్డు ఉందా? చికిత్స ఖర్చు లక్షల్లో ఉన్నా జీరో బిల్లు..!