Telugu News India News Sonali Phogat Last Video: Sonali Phogat shared her last video a few hours before death Telugu News
Sonali Phogat: సోనాలి ఫోగట్ చివరి వీడియో వైరల్.. మరణానికి కొన్ని గంటల ముందు ఆమె ఎలా ఉందంటే..?
సోషల్ మీడియా వినియోగదారులు ఇప్పుడు ఆమెపోస్ట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్‌లో నివాళులు అర్పిస్తున్నారు.
Sonali Phogat Last Video: సోషల్ మీడియా స్టార్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు సోనాలి ఫోగట్ మరణ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సోనాలి ఫోగట్ 41 సంవత్సరాల వయస్సులో గోవాలో గుండెపోటుకు గురై కన్నుమూశారు. సోనాలి తన సిబ్బందితో కలిసి గోవా వెళ్లినట్లు సమాచారం. సోనాలి ఫోగట్ తన మరణానికి కొన్ని గంటల ముందు తన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…
कुलदीप बिशनोई जी ने मेरे फार्म हाउस पर आकर आज शिष्टाचार भेंट।
Manohar Lal Kuldeep Bishnoi pic.twitter.com/GyMolMPMxH
టిక్‌టాక్‌తో ఫేమస్ అయిన సోనాలి ఫోగట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన ఫోటోలు, వీడియోలు, రీల్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే సోనాలి ఫోగట్ మరణానికి కొన్ని గంటల క్రితం తన చివరి వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో…పింక్ టర్బన్ ధరించిన ఈ స్టార్ బాలీవుడ్ రెట్రో పాట ‘రుఖ్ సే జరా నఖబ్ హతా దో’లో రీల్ చేస్తూ.. అందంగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం కనిపిస్తుంది. ఈ వీడియోలో సోనాలి ఎంతో హ్యాపీగా, స్టైలిష్ వాక్‌లో కనిపిస్తోంది.
సోనాలి ఫోగట్ 21 సెప్టెంబర్ 1979న హర్యానాలోని ఫతేహాబాద్‌లో జన్మించారు. 2006లో ఆమె హిసార్ దూరదర్శన్‌లో యాంకరింగ్‌తో తన కెరీర్‌ని ప్రారంభించారు. 2008లో బీజేపీలో చేరారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె ఎప్పుడూ చర్చల్లోనే ఉంటూ వచ్చారు. తన జీవితంలో ఎదురైన బాధలను ‘బిగ్ బాస్’ సీజన్ 14లో ప్రేక్షకులతో పంచుకున్నారు సోనాలి. ఇప్పుడు సోనాలి ఫోగట్ మరణం కూడా ఆమె భర్త మరణంలాగే..మిస్టరీగా మారింది.
దీనికి కొద్దిసేపటి ముందు… సోనాలి తన అందమైన రూపానికి సంబంధించిన కొన్ని సెల్ఫీలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు.. సోషల్ మీడియా వినియోగదారులు ఇప్పుడు ఆమెపోస్ట్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్‌లో నివాళులు అర్పిస్తున్నారు.