Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Threat: ముంబైలో ‘ఉగ్ర’ అలజడి.. ముఖేష్ అంబానీ, అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు..

ముంబైలో ఓ పాక్ ఉగ్రవాది ఎంటర్ అయ్యాడని ఎన్ఐఏ పోలీసు వర్గాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదిని పట్టుకునేందుకు జాతీయ సంస్థలు, పోలీసులు తీవ్రగాలింపు చర్యలు చేపట్టారు.

Bomb Threat: ముంబైలో ‘ఉగ్ర’ అలజడి.. ముఖేష్ అంబానీ, అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు..
Bomb Threat
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 01, 2023 | 1:54 PM

ముంబైలో ఓ పాక్ ఉగ్రవాది ఎంటర్ అయ్యాడని ఎన్ఐఏ పోలీసు వర్గాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదిని పట్టుకునేందుకు జాతీయ సంస్థలు, పోలీసులు తీవ్రగాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ అగ్రనటులు అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతోపాటు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. అగ్ర నటుల నివాసం వద్ద బాంబులు పెట్టామంటూ మంగళవారం ఉదయం నాగ్‌పుర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. క్షణ్ణంగా పరిశీలించిన అనంతరం పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదని ముంబై పోలీసులు వెల్లడించారు. సమాచారం ప్రకారం.. అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్రతోపాటు యాంటిలియాలోని ముఖేష్ అంబానీ ఇంటికి కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్స్‌ చేసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.

అయితే, అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో ఐదు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అతని ఇళ్ల పేర్లు – జల్సా, జనక్, వత్స, ప్రతీక్ష. బచ్చన్‌లు ముంబైలో కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ప్రతీఖా. అమితాబ్ దివంగత తల్లిదండ్రులు నివసించే ఇల్లు ఇదే. ప్రస్తుతం బచ్చన్ కుటుంబం మొత్తం జల్సాలో నివసిస్తోంది. మరోవైపు ధర్మేంద్ర జుహూలోని బంగ్లాలో నివాసం ఉంటున్నారు.

ఇదిలాఉంటే.. అంతకుముందు వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి పలు మార్లు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అంబానీ కుటుంబం Z+ సెక్యూరిటీని అందుకుంది. అంబానీ, అతని కుటుంబానికి Z+ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరడంతోపాటు.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ముంబైలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా వారి భద్రతను పర్యవేక్షించాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ భద్రతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నీ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భరిస్తారని కోర్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!