Vrindavan: వజ్రాల నగల దొంగగా మారిన కోతి.. భక్తుడి చేతిలోని హ్యాండ్ బ్యాగ్ తో అడవిలోకి పరారీ..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బృందావన్‌లో ఒక కోతి బ్యాగ్ ని దొంగాలిమ్చింది. ఆ బ్యాగ్ లో నగలు ఉన్నాయని భక్తుడు లబోదిబోమన్నాడు. ఆ కోతిని పట్టుకుని బ్యాగ్ తీసుకునేందుకు గంటలు కష్టపడాల్సి వచ్చింది. చివరకు బ్యాగ్ దొరకడమే కాదు దానిలో అన్ని ఆభరణాలు, నగలను భక్తుడి చేతికి అందాయి. వివరాల్లోకి వెళ్తే..

కృష్ణుడు బాల్యంలో నడయాడిన నెల బృందావనాన్ని సందర్శించేందుకు రోజూ లక్షలాది మంది భక్తులు నగరానికి చేరుకుంటారు. ఈ నగరంలో మనుషుల సంఖ్యతో పాటు కోతుల సంఖ్య కూడా అధికమే. నగరానికి వచ్చిన భక్తులను ఈ కోతులు విడిచి పెట్టవు. తమకు దొరికిన దానిని తీసుకుని పారిపోతాయి. ఇక్కడ ఉన్న కోతులు భక్తులతో పాటు స్థానికుల మొబైల్స్, గ్లాసెస్ , పర్సులువంటివి తీసుకెళ్తాయి. అపుడు భక్తులు వాటికి తిండానికి పండ్లు ఇస్తే.. తాము తీసుకున్న వస్తువుని తిరిగి ఇచ్చేస్తాయి. అయితే గురువారం సాయత్రం ఒక కోతి భక్తుడి నుంచి పర్సును, మొబైల్ , కళ్ళజోడు ని తీసుకుని వెళ్ళలేదు.. అతని చేతిలో ఉన్న ఒక బ్యాగ్ ని ఎత్తుకుని వెళ్ళింది.
అవును గురువారం సాయంత్రం బృందావనంలోని ఒక కోతి ఒక భక్తుడి నుంచి నగలతో నిండిన సంచిని ఎత్తుకెళ్లింది. ఆ సంచిలో 20 లక్షల విలువైన ఆభరణాలు, నగదు కూడా ఉన్నాయి. ఆ నగల సంచిని ఎత్తుకెళ్లినప్పుడు, ఆ ప్రాంతమంతా కోలాహలం చెలరేగింది. కోతి నుంచి సంచిని తీసుకునేందుకు అందరూ గుమిగూడారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే.. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాగ్ ఉన్న కోతిని పట్టుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు.
అకస్మాత్తుగా చేతిలోని బ్యాగును తీసుకొని పారిపోయిన కోతి
గురువారం సాయంత్రం అలీఘర్ నివాసి అభిషేక్ అగర్వాల్, ఠాకూర్ బంకే బిహారీ మహారాజ్‌ను సందర్శించడానికి తన మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి బృందావన్‌కు వచ్చాడు. అతను ఠాకూర్ బాంకే బిహారీ మహారాజ్ బంగ్లా సేవను కూడా పూర్తి చేసాడు. బంగ్లా సేవ చేసిన తర్వాత.. అతను తన కుటుంబంతో సాయంత్రం అలీఘర్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లేందుకు పయనం అయ్యాడు. అతని చేతిలో విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్న ఒక బ్యాగ్ ఉంది. అతను బృందావనంలోని గౌతమ్ పద తిరహాకు చేరుకున్నప్పుడు.. అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక కోతి వచ్చి అభిషేక్ అగర్వాల్ చేతిలోని బ్యాగ్‌ను తీసుకొని పారిపోయింది.
పండ్లు ఇచ్చి కోతినుంచి బ్యాగ్ తీసుకునే ప్రయత్నం..
అభిషేక్ అగర్వాల్ చేతిలోని బ్యాగును కోతి తీసుకొని పారిపోగానే.. అతనికి షాక్ తో చెమటలు పట్టాయి. అభిషేక్ భయపడ్డాడు. ఎందుకంటే బ్యాగులో 20 లక్షల విలువైన నగలు, ఒక డైమెండ్ నెక్లెస్, రెండు ఉంగరాలు, రెండు టాప్స్ , కాళ్ళ పట్టీలు ఉన్నాయి. నగదు కూడా ఉంది. అభిషేక్ అరుస్తూ కోతిని పట్టుకోండి.. అది తీసుకున్న బ్యాగ్ చాలా విలువైనది అని అరిచాడు. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు పోగయ్యారు. కోతికి పండ్లను ఇచ్చి బ్యాగును తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు.
ఎన్ని చేసినా బ్యాగ్ వదలని కోతి
అయితే కోతికి ఎన్ని రకాల పండ్లు ఆహారపదార్థాలు ఇచ్చినా… ఎన్ని చేసినా కోతి గంటసేపు అయినా బ్యాగును వదలేదు. హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకుని చిట్టడవిలోకి వెళ్లి అదృశ్యమైంది. దీంతో అభిషేక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న తర్వాత, బృందావన్ కొత్వాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. మొత్తం పోలీసుల బృందం ఆ బ్యాగు కోసం వెతకడం ప్రారంభించింది. సిసిటివి ఫుటేజ్, ఫీల్డ్ ట్రాకింగ్ ద్వారా అధికారులు కోతి బ్యాగు దాచిన పొదకు వద్దకు చేరుకున్నారు. చాలా గంటలు కష్టపడిన తర్వాత బ్యాగు దొరికింది. అందులోని నగలు , నగదు సేఫ్ గా ఉన్నాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..