Bhishma Niti: జీవితంలో ఏ మార్గం లేదనే నిరాశలో ఉంటే.. భీష్ముడు చెప్పిన ఈ విషయాలను అనుసరించండి..
మహాభారతంలో శంతన మహారాజు గంగాదేవిల తనయుడు భీష్ముడు. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసినందున భీష్ముడు అయ్యాడు. గంగాదేవికి జన్మించినందున గాంగేయుడుగా, శంతనుడి కుమారుడు కనుక శాంతనవుడుగా పిలవబడ్డాడు.మహాభారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా సాగిన భీష్ముడు.. కురుక్షేత్ర యుద్ధంలో గాయపడి అంపశయ్య మీద ఉండి.. ధర్మరాజుకి రాజనీతిని గురించి భోదించాడు. అలా భీష్ముడు చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయకమైన విషయాలు నేటి మానవులకు కూడా అనుసరణీయం.

మహాభారతంలో భీష్ముడు త్యాగం, కర్తవ్యం, సహనానికి చిహ్నం. తాను చేసిన ప్రతిజ్ఞకి కట్టుబడి జీవితాంతం గడిపాడు. తన ప్రతిజ్ఞను ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎప్పుడూ ఉల్లంఘించలేదు. అర్జునుడి బాణాల శరాఘాతానికి యుద్ధభూమిలో కూలిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో పాండవులకు రాజనీతి, పాలకులకు ఉండాల్సిన లక్షణాలు వంటి అనేక విషయాలను భోదించాడు. అంతేకాదు ఈ సమయంలో విష్ణు సహస్ర నామాలని కీర్తించాడు. సమస్త మానవాళికి విష్ణు సహస్రనామాలను అందించాడు భీష్ముడు. అయితే భీష్ముడు ఈ సమయంలో చెప్పిన విషయాలు భీష్మ నీతిగా ప్రసిద్దిగాంచింది. ఇందులోని విషయాలు నేటి మానవుని కూడా అనుసరణీయం.
ఎవరికైనా జీవితంలో కష్టం నష్టం ఇబ్బందులు అనేవి సహజం. అలాంటి సందర్భంలో జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతే, లేదా వేరే మార్గం కనిపించకపోతే.. భీష్మ పితామహుడు చెప్పిన కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకొండి. ఈ విషయాలు మీకు ధైర్యాన్ని, కష్ట సమయాల్లో మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి.
మనిషికి ఎటువంటి పరిస్థితిలు ఎదురైనా తన మతాన్ని, ధర్మాన్ని అనుసరించాలి.
భీష్మ పితామహుడు తన జీవితంలో తాను చెప్పినదంతా అనుసరించాడు. దీని కోసం అతను తన వ్యక్తిగత ఆనందాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. మార్గం కష్టంగా ఉన్నప్పుడు.. ఎవరైనా సరే తమ ధర్మం, బాధ్యతలకు కట్టుబడి ఉండాలని భీష్ముడు అనుసరించాడు. అదే సమస్త మానవాళికి బోధించాడు.
స్వీయ నియంత్రణ అనేది అతి పెద్ద ఆయుధం.
కష్ట సమయాల్లో భావోద్వేగాలను నియంత్రించుకోవడం ,ప్రశాంతంగా ఉండటం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం భీష్మ పితామహుడు చేసిన గొప్ప బోధనలలో ఒకటి.
కాలం శక్తివంతమైనది.. అది అన్నింటినీ మార్చగలదు.
భీష్మ పితామహుడు కాలం అత్యంత శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరి జీవితంలో కాలం మారుతుందని చెబుతాడు. ఎవరైనా జీవితంలో నిరాశ చెందితే.. వారు భీష్మ పితామహుడు చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతికూల సమయాల్లో సహనం, విశ్వాసాన్ని కాపాడుకుని.. ముందుకు సాగాలి.
జ్ఞానం గొప్ప ఆస్తి.. జ్ఞానం ఉన్నవాడే నిజమైన యోధుడు.
భీష్మ పితామహుడు తన జీవితంలోని లోతైన విషయాలను .. వాటిని ఎదుర్కొన్న సందర్భాలను అర్జునుడు, యుధిష్ఠిరులకు చాలాసార్లు వివరించాడు. మనిషికి అతి పెద్ద ఆయుధం జ్ఞానం అని చెప్పాడు. జ్ఞానం కంటే గొప్ప శక్తి మరొకటి లేదని అతను నమ్మాడు. అటువంటి పరిస్థితిలో.. జ్ఞానం .. మంచి చెడుల విచక్షణ ఉన్నవాడే నిజమైన యోధుడు.
కష్టాలు మనిషికి ఆత్మపరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇస్తాయని భీష్మ పితామహుడు తెలిపాడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలనీ సూచించాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు