Jyeshtha Purnima: జేష్ఠ పౌర్ణమి రోజున చేసే దానాలు అన్ని సమస్యలకు విముక్తి.. ఏ రాశి వారు ఏ దానం చేయాలంటే
హిందూ మతంలో ప్రతి తిధికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. ఈ తిధుల్లో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి లభిస్తుంది. అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని నమ్మకం. జేష్ఠ మాసంలో పౌర్ణమిరోజున శ్రీ మహా విష్ణు, లక్ష్మీదేవిని పూజించి కొన్ని రకాల దానాలను చేయడం వలన జీవితంలో చంద్ర దోషం తొలగి.. ఆర్ధిక సమస్యలు తీరతాయని విశ్వాసం. ఈ రోజు ఏ రాశుల వారు ఏ దానం చేయాలో తెలుసుకుందాం..

హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి అంటారు.. ఏడాది పొడవునా వచ్చే ప్రతి పౌర్ణమికి దాని సొంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. జ్యేష్ఠ పౌర్ణమను ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు ఉపవాసం ఉంటారు. అంతేకాదు ఈ రోజున చంద్రుడిని పూజించడం కూడా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి తిధి జూన్ 10, 2025 మంగళవారం ఉదయం 11:35 గంటలకు ప్రారంభమై జూన్ 11 బుధవారం మధ్యాహ్నం 1:13 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఉదయతిథి ప్రకారం, జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం, 11, 2025న జరుపుకుంటారు.
జ్యేష్ఠ పౌర్ణమి ప్రాముఖ్యత పౌర్ణమి రోజున విష్ణువు , లక్ష్మీ దేవిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పుణ్యం కలుగుతుందని నమ్మకం. మనస్సు శుద్ధి అవుతుంది. కుటుంబానికి ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. జ్యేష్ఠ పౌర్ణమి రోజున దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున అవసరమైన వారికి ఆహారం, బట్టలు దానం చేస్తారు. ఆపన్నులకు సేవ చేస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున రాశి ప్రకారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయని, జాతకంలో ఉన్న చంద్ర దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున 12 రాశుల వారు ఏ దానం చేయడం శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం..
- మేష రాశి : ఈ రాశి వారు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఖీర్ ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. ఇది జీవితంలో శ్రేయస్సును తెస్తుంది.
- వృషభ రాశి: ఈ రోజున వృషభ రాశి వారు పేదవారికి పెరుగు లేదా నెయ్యి దానం చేయాలి. ఇది ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది.
- మిథునం: వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు జ్యేష్ఠ పౌర్ణమి రోజున పాలు లేదా బియ్యం దానం చేయాలి, ఇది వీరికి ప్రయోజనం చేకూరుస్తుంది.
- కర్కాటక రాశి: జ్యేష్ఠ పౌర్ణమి రోజున కర్కాటక రాశి వారు చక్కెర కలిపిన పాలను, మిఠాయిని దానం చేయాలి. ఇలా చేయడం పనిలో విజయాన్ని తెస్తుంది.
- సింహ రాశి: ఈ రోజు ఈ రాశి వారు బెల్లం దానం చేయడం శుభప్రదం. ఇది మీ గ్రహ దోషాలను తొలగిస్తుంది.
- కన్య రాశి: ఈ రాశి వారు ఈ రోజున ఖీర్ దానం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది. తన ఆశీస్సులను కురిపిస్తుంది.
- తులారాశి: పౌర్ణమి రోజున పాలు, బియ్యం, నెయ్యి దానం చేయండి. దీనివల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది.
- వృశ్చిక రాశి: ఈ వారు ఎరుపు రంగు దుస్తులు లేదా ఎరుపు రంగులో ఉన్న ఏదైనా వస్తువును దానం చేయాలి. ఇది గ్రహ దోషాలను తొలగిస్తుంది.
- ధనుస్సు రాశి: జ్యేష్ఠ పూర్ణిమ నాడు పప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి లభిస్తాయి.
- మకర రాశి: జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఈ రాశివారు బియ్యాన్ని ప్రవహిస్తున్న నదిలో విడిచి పెట్టండి. ఇలా చేయడం వలన దోషాల నుంచి విముక్తిని ఇస్తుంది. ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది.
- కుంభ రాశి: కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున పేదవారికి అన్నం పెట్టాలి. ఇది డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది.
- మీన రాశి: ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీదేవిని పూజించాలి . బ్రాహ్మణులకు అన్న వితరణ చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు