AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budha Astro Tips: జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే ఈ 8 లక్షణాలు కనిపిస్తాయి.. పరిహారాలు ఏమిటంటే

హిందూ మతంలో నవ గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. నవ గ్రహాల్లో బుధుడి గ్రహాల రాకుమారుడు అని అంటారు. బుధుని వాక్కు, వ్యాపారం, కమ్యూనికేషన్, తెలివితేటలకు కారకంగా పరిగణిస్తారు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు ఏ సమస్యలను ఎదుర్కొంటారు? దీనిని నివారించడానికి చేయాల్సిన పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం...

Budha Astro Tips: జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే ఈ 8 లక్షణాలు కనిపిస్తాయి.. పరిహారాలు ఏమిటంటే
Budha Astro Tips
Surya Kala
|

Updated on: Jun 07, 2025 | 4:29 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుడు అయిన బుధుడు తెలివితేటలు, వాక్కు, తర్కం, కమ్యూనికేషన్, వ్యాపారానికి కారకుడిగా పరిగణించబడతాడు. బుధుడు మిథున రాశి , కన్య రాశి వారికి అధిపతి. ఎవరి జాతకంలో బుధుడు బలమైన స్థానాన్ని కలిగి ఉంటాడో.. అటువంటి వ్యక్తులు అత్యంత తెలివి తేటలు కలిగి ఉంటారని.. తమ తెలివితేటల ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోగలరని, ప్రతి రంగంలో విజయం సాధించగలరని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడింది. మరోవైపు ఎవరి జాతకంలోనైనా బుధుడు బలహీనంగా ఉంటే అటువంటి వ్యక్తులు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. లేదా వీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. ఈ రోజు ఎవరి జాతకంలోనైనా బుధుడు బలహీనంగా ఉంటే.. అటువంటి వ్యక్తులలో ఏ లక్షణాలు కనిపిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం..

జాతకంలో బుధుడు బలహీనంగా ఈ 8 సంకేతాలు కనిపిస్తాయి

  1. తప్పుడు నిర్ణయాలు: జాతకంలో బుధుడు చెడు స్థానంలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోలేడు. అటువంటి పరిస్థితిలో తప్పుడు నిర్ణయం తీసుకుని ఇబ్బంది పడతారు.
  2. జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటుంది: బుధుడు అశుభంగా ఉన్న వ్యక్తులు ప్రతి విషయాన్నీ మరచిపోతారు. ఏ పనిపై దృష్టి పెట్టలేరు.. పని చేసే విషయంలో తొందర పడతారు లేదా తప్పుగా చేస్తారు.
  3. మాట్లాడటంలో సమస్యలు: ఎవరి జాతకంలోనైనా బుధుడు బలహీనంగా ఉంటే వాక్కుకు సంబంధించిన సమస్యలు వారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి. మాట్లాడటంలో ఆలస్యం లేదా మాట మాటకి ఇబ్బందిని ఎదుర్కొంటారు.
  4. ఒత్తిడి లేదా ఆందోళన: బుధ గ్రహం అశుభ ప్రభావం కారణంగా.. వ్యక్తి ఒత్తిడికి గురవుతాడు లేదా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతాడు.
  5. వ్యాపారంలో నష్టం: జాతకంలో బుధుని స్థానం సరిగ్గా లేకుంటే లేదా బలహీనంగా ఉంటే వ్యాపార కారకుడైన బుధుని బలహీన స్థితి వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో పదే పదే నష్టాలను చవిచూస్తారు.
  6. చర్మం, నరాల సంబంధిత సమస్యలు: జాతకంలో బుధుడు అశుభ స్థానం కారణంగా ఒక వ్యక్తికి చర్మ సంబంధిత అలెర్జీలు , చేతులు, కాళ్ళు తిమ్మిరి వంటి సమస్యలు కలుగవచ్చు.
  7. ఇతరులతో మాట్లాడేవిషయంలో సమస్యలు: బలహీనమైన బుధుడు ప్రభావం కారణంగా..వ్యక్తి తన అభిప్రాయాలను ఇతరులకు సరిగ్గా చెప్పలేదు. అందువల్ల అపార్థం చేసుకోవడం, చెప్పే విషయాలను ఆర్ధం చేసుకోలేకపోవడం మొదలైన సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయి.
  8. విద్యలో అడ్డంకి: వ్యక్తి చదువుపై ఆసక్తిని కోల్పోతాడు. విషయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఇబ్బంది పడతాడు. ఇదంతా జాతకంలో బుధుడు బలహీనంగా ఉండటం వల్ల జరుగుతుంది.

జాతకంలో బుధ గ్రహ స్థానాన్ని బలోపేతం చేయడానికి చేయాల్సిన చర్యలు

  1. జాతకంలో బుధుని స్థానాన్ని బలోపేతం చేయడానికి, బుధవారం రోజున బుధుని బీజ మంత్రమైన “ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః” జపించండి.
  2. బుధవారం ఆకుపచ్చని దుస్తులు ధరించండి.
  3. బుధవారం రోజున పచ్చి కూరగాయలు దానం చేయండి, ఆవుకు పచ్చ గడ్డి లేదా పాలకూర తినిపించండి.
  4. బుధ గ్రహ శుభ ఫలితాల కోసం బుధవారం రోజున గణపతిని పూజించి దర్భగడ్డిని, తమలపాకు మొదలైన వాటిని సమర్పించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?