పరమశివుడికి ఇష్టమైన రాశులివే..! వారికి రాజయోగాలు, ధన యోగాలు
Raja Yoga and Dhana Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు పరమశివుని అనుగ్రహాన్ని ఎక్కువగా పొందుతారు. శివార్చన, ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ రాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, ఆదాయ వృద్ధి, విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఈ రాశుల వారికి ఈ సంవత్సరం అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతుంది.

Lord Shiva Favored Zodiac Signs
జ్యోతిషశాస్త్రం ప్రకారం శివుడికి బాగా ఇష్టమైన రాశులున్నాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిజాయతీ, ధైర్య సాహసాలు, ప్రయత్నాలు, కార్యదక్షత కలిగిన రాశుల మీద ఆయనకు విపరీతమైన అభిమానం ఉంటుందని, ఈ లక్షణాలు కలిగినవారికి ఆయన చేయూతనిస్తాడని కూడా జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ప్రధాన గ్రహాల అనుకూల సంచారం వల్ల ప్రస్తుతం ఈ లక్షణాలు కలిగిన రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులు. ఈ రాశుల వారు శివార్చన చేయించడం, వీలైనప్పుడల్లా శివుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఏడాది వీరికి ఆశించిన ఫలితాలుంటాయి.
- మేషం: అలవికాని భారాన్ని, బాధ్యతలను మోయడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం, రాశ్యధిపతి కుజుడంటే ఇష్టం ఉండడం వల్ల కొద్దిపాటి శివార్చనతో ఈ రాశివారికి ఈ ఏడాదంతా వైభవంగా గడిచిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఉన్నతస్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఆత్మ విశ్వాసానికి, పట్టుదలకు మారుపేరైన ఈ రాశివారికి శివానుగ్రహం వల్ల ఏడాదంతో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతోంది. ఈ రాశివారు తరచూ శివార్చన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి, అనేక విధాలుగా పురోగతి చెందడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది.
- సింహం: నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకునిపోయే తత్వం కలిగిన ఈ రాశివారంటే శివుడికి అంతులేని అభిమానం. రాశ్యధిపతి రవి శివుడికి మిత్రుడైన కారణంగా ఈ రాశివారు కొద్దిపాటి శివ భక్తితో ఏడాదంతా శుభప్రదమైన జీవితం గడపడం జరుగుతుంది. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
- వృశ్చికం: ధైర్యం, తెగువ, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే ఈ రాశన్నా, రాశ్యధిపతి కుజుడన్నా శివుడికి అభి మానం ఎక్కువ. తరచూ శివార్చన చేయడం, శివుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ రాశివారికి ఈ ఏడాది తప్పకుండా రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు సమసిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది.
- ధనుస్సు: పట్టిన పట్టు విడవకపోవడం, ఏదైనా సాధించాలనుకోవడం వంటి తత్వాలు కలిగిన ఈ రాశివారి మీద శివుడికి శ్రద్ధాసక్తులు ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. వీలైనప్పుడల్లా శివార్చన చేయడం, శివుడికి ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఏడాదంతా పరమశివుడి కటాక్ష వీక్షణాలు ఈ రాశివారి మీద ప్రసరించే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసు లోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.
- మీనం: నీతి నిజాయతీలతో వ్యవహరించడంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగి ఉండే ఈ రాశివారికి ఈ ఏడాది శివుడి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. జీవితంలో ముఖ్యమైన కోరికలు నెరవేరడంతో పాటు, సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఏలిన్నాటి శని ప్రభావం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆదాయానికి లోటుండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.